త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | మైన‌ర్‌కు వేధింపులు – ప్ర‌ముఖ న‌టుడిపై పోక్సో కేసు

మైన‌ర్ బాలిక‌ను వేధించిన కేసులో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు రోహిత్ చండేల్‌పై పోక్సో కేసు న‌మోదు అయ్యింది. శ‌నివారం అత‌డిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హిందీలో సీరియ‌ల్స్‌తో పాటు కొన్ని సినిమాలు చేశాడు రోహిత్ చండేల్‌.

N

Entertainment | Published On Jul 11, 2026, 6.10 pm IST

Bollywood | మైన‌ర్‌కు వేధింపులు – ప్ర‌ముఖ న‌టుడిపై పోక్సో కేసు
Advertisement

Bollywood |  మైన‌ర్ బాలిక‌ను వేధించిన కేసులో ప్ర‌ముఖ బాలీవుడ్ టీవీ యాక్ట‌ర్ రోహిత్ చండేల్‌పై పోక్సో కేసు న‌మోదు అయ్యింది. శ‌నివారం ముంబై పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. గ‌త కొద్ది రోజులుగా వేర్వేరు నంబ‌ర్ల‌తో ఫోన్ చేస్తూ రోహిత్ చండేల్ త‌న‌ను వేధింపుల‌కు గురిచేసిన‌ట్లు ఓ మైన‌ర్ బాలిక శ‌నివారం ముంబై పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. జూలై 5వ తేదీన‌ ఇంటికి వెళుతోన్న త‌న‌ను రోహిత్ చండేల్ అడ్డ‌గించాడ‌ని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డ‌మే కాకుండా భౌతికంగా దాడుల‌కు పాల్ప‌డిన‌ట్లు త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది. మైన‌ర్ కంప్లీట్‌ను స్వీక‌రించిన‌ పోలీసులు రోహిత్ చండేల్‌ను అరెస్ట్ చేశారు. పోక్సోతో పాటు మ‌రో రెండు సెక్ష‌న్ల కింద అత‌డిపై కేసును న‌మోదు చేశారు. రిమాండ్‌కు త‌ర‌లించారు. కాగా ఆ బాలిక‌తో చాలా కాలంగా రోహిత్ చండేల్‌కు ప‌రిచ‌యం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టీవీ యాక్ట‌ర్‌గా...

హిందీలో టీవీ యాక్ట‌ర్‌గా ఫేమ‌స్ అయిన రోహిత్ చండేల్ కొన్ని సినిమాలు చేశాడు. యే ముష్కిల్ కా హ‌ల్ అక్బ‌ర్ బీర్బ‌ల్ సీరియ‌ల్‌తో రోహిత్ చండేల్ యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. కాశీబాయి బాజీరావ్ బ‌ల్లాల్‌లో లీడ్ రోల్‌లో క‌నిపించాడు. ఈ సీరియ‌ల్‌తో హిందీలో రోహిత్ పేరు మోరుమోగింది. అత‌డు హీరోగా న‌టించిన పాండ్య స్టోర్ సీరియ‌ల్ కూడా పెద్ద హిట్ట‌య్యింది. ప్ర‌స్తుతం సైరాబ్ అనే సీరియ‌ల్‌లో న‌టిస్తున్నాడు. ది అమెరిక‌న్ గాంధీ, బ్లైండ్ గేమ్‌, రైడ‌ర్ సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. యాక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందు మ‌హారాష్ట్ర త‌ర‌ఫున దేశ‌వాళీ క్రికెట్ ఆడాడు. మార్ష‌ల్ ఆర్ట్స్‌లో రోహిత్ చండేల్‌కు ప్రావీణ్య‌ముంది.

 

Advertisement
Advertisement