త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Microsoft | మైక్రోసాఫ్ట్ కీల‌క నిర్ణ‌యం.. 60 వేల మంది ఉద్యోగుల‌కు బైఅవుట్ ఆఫ‌ర్‌

Microsoft | గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. సంస్థ‌లోని సుమారు 60 వేల మంది ఉద్యోగుల‌కు స్వ‌చ్ఛంద విర‌మ‌ణ (Buyout) ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. భార‌త్‌, అమెరికా, కెన‌డాతోపాటు యూకేలోని ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తించ‌నుంది.

G

International | Published On Oct 27, 2026, 7.56 am IST

Microsoft | మైక్రోసాఫ్ట్ కీల‌క నిర్ణ‌యం.. 60 వేల మంది ఉద్యోగుల‌కు బైఅవుట్ ఆఫ‌ర్‌
Advertisement

Microsoft | త్రినేత్ర న్యూస్‌: గ్లోబ‌ల్ టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ (Microsoft) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. సంస్థ‌లోని సుమారు 60 వేల మంది ఉద్యోగుల‌కు స్వ‌చ్ఛంద విర‌మ‌ణ (Buyout) ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. భార‌త్‌, అమెరికా, కెన‌డాతోపాటు యూకేలోని ఉద్యోగుల‌కు ఇది వ‌ర్తించ‌నుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్ల ఏర్పాటుపై భారీగా పెట్టుబడులు పెడుతున్నందున నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు వాలంట‌రీ ఎగ్జిట్ (Voluntary Buyout) ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

భార‌త్‌లో 23 వేల మందిపై..

భార‌త్ (India) స‌హా నాలుగు దేశాల్లోని `లెవెల్ 70 (ప్రాజెక్టుల‌ను లీడ్ చేసే మేనేజ‌ర్లు, సీనియ‌ర్ ఇంజినీర్లు, అనుభ‌వ‌జ్ఞులైన నిపుణులు), అంతకంటే తక్కువ స్థాయిలో ప‌నిచేస్తున్న‌ ఉద్యోగులకు మాత్ర‌మే ఈ ఎగ్జిట్ ప్యాకేజీ (Exit Package) వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది. డేటా సెంటర్లు, సేల్స్ మరియు మార్కెటింగ్ విభాగాల్లో పనిచేసే వారికి ఇది వర్తించదని పేర్కొంది. ఇది సంస్థ‌ మొత్తం 2,23,000 మంది ఉద్యోగుల్లో దాదాపు నాలుగో వంతుకు స‌మానం కావ‌డం గ‌మ‌నార్హం. ఉద్యోగుల‌ను నిర్బంధంగా తొల‌గించ‌కుండా స్వ‌చ్ఛందంగా త‌ప్పుకునే అవ‌కాశం క‌ల్పిస్తూ కంపెనీ ఈ ఆఫ‌ర్‌ను ముందుకు తీసుకువ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఇది పూర్తిగా స్వ‌చ్ఛంద‌మైన‌ద‌ని, కొంత‌కాలం మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని సంస్థ పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు డిసెంబర్ 1 వరకు అవ‌కాశం ఇచ్చింది. బైఅవుట్‌కు అంగీక‌రించిన‌ వారు డిసెంబర్ 31 నాటికి సంస్థ నుంచి వైదొలుగుతారు. భార‌త్‌లో 23 వేల మందిపై దీని ప్ర‌భావం ఉండ‌నుంది.

`మారిన పరిస్థితులకు అనుగుణంగా మా వ్యూహాలను మార్చుకోవడంలో ఈ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ఒక ముఖ్యమైన భాగం. ఇది ఉద్యోగులకు మరింత వెసులుబాటును ఇవ్వడమే కాకుండా, వారి జీవితంలో తదుపరి అధ్యాయాన్ని నిర్మించుకోవడానికి మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది` ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అమీ కోల్‌మన్ (Amy Coleman) పేర్కొన్నారు.

ఇది రెండో సారి..

మైక్రోసాఫ్ట్ స్వ‌చ్ఛంద నిష్క్ర‌మ‌ణ‌ను ప్ర‌క‌టించింది ఈ ఏడాది ఇది రెండో సారి. అంతకుముందు ఏప్రిల్‌లో అమెరికాలో ప‌నిచేస్తున్న‌ ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మందికి ముందస్తు పదవీ విరమణ (ఎర్లీ రిటైర్మెంట్) ఆప్షన్‌ను ఇచ్చింది. దీంతో అర్హులైన ఉద్యోగులలో దాదాపు 30 శాతం మంది దీనిని ఎంచుకున్నారు. కాగా, 2025 చివరి నాటికి మైక్రోసాఫ్ట్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌నిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య‌ 2,28,000గా ఉండ‌గా, ఈఏడాది జూన్ నాటికి 2,23,000కి తగ్గింది. ప్రస్తుతం 27 శాతం మంది ఉద్యోగులు ఈ తాజా బైఅవుట్ ఆఫర్‌కు అర్హులు ఉన్నారు.

Advertisement
Advertisement