త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osman Hadi Murder | ఉస్మాన్ హాదీని నేను చంపలేదు

ఆయనకు నేను 5 లక్షల టాకాలు ఇచ్చాను. ఆయన చేసే పలు ప్రోగ్రామ్‌లకు డొనేట్ చేయాలని కోరారు. నేను ఒప్పుకున్నాను.. అంతే కానీ నేనెందుకు హాదీని చంపుతాను. నా ఫ్యామిలీని టార్చర్ చేస్తున్నారు.

J

International | Published On Dec 31, 2025, 7.09 pm IST

Osman Hadi Murder | ఉస్మాన్ హాదీని నేను చంపలేదు
Advertisement

Osman Hadi Murder | బంగ్లాదేశ్‌లో స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతడి హత్య తర్వాతనే బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ఉస్మాన్ హాదీని చంపింది వీళ్లే అంటూ కొందరి ఫోటోలు, వీడియోలను ఢాకా పోలీసులు రిలీజ్ చేశారు. అందులో ఫైజల్ కరీమ్ మసూద్ పేరును కూడా పోలీసులు చేర్చారు. దీనిపై స్పందించిన పైజల్ కరీమ్ మసూద్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

నేను హాదీని హత్య చేశానని, ఆ తర్వాత భారత్‌కి పారిపోయానని అంటున్నారు. అసలు నేను హాదీని హత్య చేయలేదు. భారత్ వెళ్లలేదు. నేను ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాను. ఇక్కడికి రావడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది.. అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. నా మీద ఎందుకు కుట్ర చేస్తున్నారో అర్థం కావడం లేదు. నేను హాదీని కలిసిన మాట వాస్తవమే. నేను హాదీ ఆఫీసుకి వెళ్లాను. నేను ఒక వ్యాపారవేత్తను. నాకు ఐటీ కంపెనీ ఉంది. అందుకే ఓ జాబ్ ఆఫర్ గురించి హాదీతో మాట్లాడేందుకే వాళ్ల ఆఫీసుకు వెళ్లాను. ఆయనకు నేను 5 లక్షల టాకాలు ఇచ్చాను. ఆయన చేసే పలు ప్రోగ్రామ్‌లకు డొనేట్ చేయాలని కోరారు. నేను ఒప్పుకున్నాను.. అంతే కానీ నేనెందుకు హాదీని చంపుతాను. నా ఫ్యామిలీని టార్చర్ చేస్తున్నారు. నా ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడుతోంది.. అంటూ వీడియోలో మసూద్ చెప్పుకొచ్చాడు.


Advertisement

తాజావార్తలు

Advertisement