Kuwait | 30 ఏండ్లలో తొలిసారి.. ఒక్క బ్యారెల్ ముడి చమురు కూడా ఎగుమతి చేయని కువైట్
Kuwait | ఇరాన్, అమెరికా యుద్ధ కువైట్‌ను (Kuwait) కుదిపేసింది. ప్రధానంగా ముడి చమురు (crude oil) ఎగుమతిపై ఆధారపడిన ఆదేశం ఇరాన్, అమెరికా (Iran America War) దాడులు, ఎదురుదాడులతో ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది.
International | Published On May 3, 2026, 9.04 am IST
Kuwait | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధ కువైట్‌ను (Kuwait) కుదిపేసింది. ప్రధానంగా ముడి చమురు (crude oil) ఎగుమతిపై ఆధారపడిన ఆదేశం ఇరాన్, అమెరికా (Iran America War) దాడులు, ఎదురుదాడులతో ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఏప్రిల్ నెలలో ఆ దేశం ఒక్క బ్యారల్ ముడి చమురును కూడా ఎగుమతి (Exports) చేయలేకపోయింది. చమురు ఎగుమతి నిలిచిపోవడం గత మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి అని ట్యాంకర్‌ట్రాకర్స్ వెబ్‌సైట్ వెల్లడించింది. మొదటి గల్ఫ్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఏప్రిల్‌లో కువైట్ ఒక్క బ్యారెల్ ముడి చమురును కూడా ఎగుమతి చేయలేదని పేర్కొంది.
అయితే ఆ `దేశం చమురు ఉత్పత్తిని కొనసాగిస్తున్నప్పటికీ, ముడి చమురు ఎగుమతులు మాత్రం నిలిచిపోయాయని తెలిపింది. కువైట్ ఇప్పటికీ చమురును ఉత్పత్తి చేస్తున్నదని, అందులో కొంత భాగాన్ని నిల్వ చేస్తుండగా, మరికొంత భాగాన్ని శుద్ధి చేసి ఉత్పత్తులుగా మారుస్తున్నది. వాటిలో కొన్నింటిని ఎగుమతి చేసింది. అయితే ఇప్పటి వరకు ముడి చమురు మాత్రం దేశం నుంచి బయటకు వెళ్లలేదు` అని వెల్లడించింది. ఈ విషయం వాస్తవమైతే 1991 గల్ఫ్ యుద్ధం (Gulf War) ముగిసిన తర్వాత కువైట్ ముడి చమురు ఎగుమతి చేయకుండా ఉన్న మొదటి నెలగా ఏప్రిల్ నిలిచిపోతుంది.
కాగా, ప్రపంచ చమురు రవాణాకు ప్రధానమైన హర్మూజ్ జలసంధిని యుద్ధం కొనసాగినన్ని రోజులు ఇరాన్ మూసివేసింది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ జలసంధిని.. అమెరికా దిగ్భందించిన విషయం తెలిసిందే. ఇది నౌకాయానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






