త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Crude Oil | అమెరికా-ఇరాన్ ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్ర‌త‌రం.. భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

Crude Oil | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధ ఉద్రిక్త‌తలు మ‌రింత తీవ్ర‌త‌రం కావ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 103 డాల‌ర్ల‌కు చేరింది. ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంద‌న్న ఆందోళ‌న‌లు మ‌రింత పెరిగాయి.

S

Business | Published On Oct 2, 2026, 11.21 am IST

Crude Oil | అమెరికా-ఇరాన్ ఉద్రిక్త‌త‌లు మ‌రింత తీవ్ర‌త‌రం.. భారీగా పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..
Advertisement

Crude Oil | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధ ఉద్రిక్త‌తలు మ‌రింత తీవ్ర‌త‌రం కావ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు మ‌ళ్లీ భారీగా పెరిగాయి. శుక్ర‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 103 డాల‌ర్ల‌కు చేరింది. ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఆటంకం క‌లుగుతుంద‌న్న ఆందోళ‌న‌లు మ‌రింత పెరిగాయి. దీంతో ధ‌ర‌లు గ‌రిష్ట స్థాయిలో కొన‌సాగుతున్నాయి. శుక్ర‌వారం ఉద‌యం బ్రెంట్ క్రూడ్ ధ‌ర 101.50 డాల‌ర్ల వ‌ద్ద ప్రారంభం అయి స్థిరంగా కొన‌సాగుతోంది. డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 0.55 శాతం స్వ‌ల్పంగా త‌గ్గి బ్యారెల్‌కు 95 డాల‌ర్ల‌కు చేరింది.

భార‌త మార్కెట్ల‌లో తీవ్ర‌మైన అమ్మ‌కాల ఒత్తిడి..

ముడి చ‌మురు ధ‌ర‌లు భారీగా పెరుగుతుండ‌డం భార‌త్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల‌కు ప్ర‌తికూలంగా మారింది. మ‌రోవైపు అమెరికా ట్రెజ‌రీ బాండ్ ఈల్డ్స్ రాబ‌డి అధికంగా ఉండడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట‌ర్లు భార‌త స్టాక్ మార్కెట్ల నుంచి త‌మ నిధుల‌ను భారీ ఎత్తున ఉప‌సంహరించుకుంటున్నారు. గ‌త 9 నెల‌ల కాలంలో వారు ఏకంగా రూ.3 ల‌క్ష‌ల కోట్ల నిధుల‌ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. గ‌త సెష‌న్‌లోనూ వారు భారీ ఎత్తున ఈక్విటీ అమ్మ‌కాల‌ను కొన‌సాగించారు. ముడి చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణం భారీగా పెరుగుతుంద‌న్న అంచ‌నాలు నెల‌కొన‌డంతోపాటు విదేశీ పెట్టుబ‌డిదారుల అమ్మ‌కాలు భార‌త స్టాక్ మార్కెట్ల‌కు ప్ర‌తిబంధ‌కంగా మారాయి. దీంతో నిఫ్టీ గ‌త 25 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా అత్యంత దారుణంగా ప‌త‌న‌మైంది.

ప‌శ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్త‌త‌లు..

ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య రోజు రోజుకీ మ‌రింత పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్త‌త‌లు చ‌మురు స‌ర‌ఫరాపై ఆందోళ‌న‌ల‌ను మ‌రింత పెంచుతున్నాయి. అమెరికా త‌న 3వ విమాన వాహ‌క నౌకా ద‌ళాన్ని మెరైన్ కార్ప్స్ నౌక‌ల‌ను, 10వేల మంది అద‌న‌పు సైనికుల‌ను మ‌ధ్య‌ప్రాచ్యానికి పంపిస్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. భౌగోళిక రాజ‌కీయ ప‌రిణామాలు, ఎఫ్ఐఐల అమ్మ‌కాలు, పెరుగుతున్న ముడి చ‌మురు ధ‌ర‌ల కార‌ణంగా భార‌త మార్కెట్ల‌లో భారీ స్థాయిలో న‌ష్టాలు వ‌స్తున్నాయి. దీంతో పెట్టుబ‌డిదారులు పెద్ద ఎత్తున ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ప‌శ్చిమ ఆసియాలో యుద్ధం ముగిస్తేగానీ మ‌ళ్లీ సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డే అవ‌కాశం లేద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement