Stock Markets | ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. పెరిగిన చమురు ధరలు..
Stock Markets | మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా నాలుగో సెషన్‌లోనూ అమ్మకాలు కొనసాగించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ 22,665 వద్ద ప్రారంభమై సుమారు 50 పాయింట్లు (0.23 శాతం) నష్టపోయింది.
Stock Markets | మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడిదారులు వరుసగా నాలుగో సెషన్‌లోనూ అమ్మకాలు కొనసాగించడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిఫ్టీ 50 సూచీ 22,665 వద్ద ప్రారంభమై సుమారు 50 పాయింట్లు (0.23 శాతం) నష్టపోయింది. సెన్సెక్స్ 72,441.15 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి 87.92 పాయింట్లు (0.12 శాతం) కిందకు చేరింది. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ మిడ్‌స్మాల్ ఐటీ అండ్ టెలికాం ఇండెక్స్ 1 శాతానికి పైగా లాభపడి టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ కెమికల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ సిమెంట్, నిఫ్టీ మీడియా సూచీలు కూడా 1 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు మెటల్ షేర్లలో ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మెటల్ 0.42 శాతం క్షీణించింది. హెల్త్‌కేర్, ఫార్మా సూచీలు కూడా స్వల్పంగా నష్టపోయాయి.
పెరుగుతున్న అమెరికా బాండ్ ఈల్డ్స్‌తో ఒత్తిడి..
అమెరికా బాండ్ ఈల్డ్స్ అధిక స్థాయిలో కొనసాగడం విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలకు కారణమవుతోందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. అయితే ఇటీవల మార్కెట్‌లో వచ్చిన కరెక్షన్ కారణంగా భారతీయ మార్కెట్‌లోని కొన్ని విభాగాల్లో వాల్యుయేషన్లు ఆకర్షణీయ స్థాయికి చేరాయని తెలిపారు. మార్కెట్‌లో వచ్చిన ఈ కరెక్షన్‌ను భారతీయ ఇన్వెస్టర్లు అవకాశంగా చూడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. మంచి వృద్ధి అవకాశాలున్న లార్జ్‌క్యాప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన వాల్యుయేషన్లకు చేరుకున్నాయని తెలిపారు. మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మార్కెట్‌లో ర్యాలీకి అవకాశం ఏర్పడుతుందదని, అలాంటి పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్ మార్కెట్ లీడర్లు ముందుండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషించారు.
మార్కెట్ స్థిరపడుతుందా..?
టెక్నికల్ అనలిస్టుల ప్రకారం.. ఇటీవలి పతనం తర్వాత మార్కెట్ స్థిరపడేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. కీలక టెక్నికల్ స్థాయిల వద్ద కొనుగోళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు. మంగళవారం నాటి సెషన్‌లో నిఫ్టీ హ్యామర్ క్యాండిల్‌ను ఏర్పరచడం దిగువ స్థాయిల వద్ద కొనుగోలు ఆసక్తిని సూచిస్తోందని పేర్కొన్నారు. కొన్ని కీలక హెవీవెయిట్ షేర్లలో బలమైన ట్రేడింగ్ మార్కెట్ పతనాన్ని పరిమితం చేసిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మాత్రం అధిక స్థాయిలోనే కొనసాగుతున్నాయి. బుధవారం సెషన్‌లో క్రూడ్ ధరలు భారీగానే పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.56 శాతం పెరిగి బ్యారెల్‌కు 95 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 0.44 శాతం పెరిగి 92 డాలర్లకు చేరింది. ఫారెక్స్ మార్కెట్‌లో భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. అయితే మంగళవారం నాడు వచ్చిన భారీ అమ్మకాల అనంతరం బుధవారం మార్కెట్లు కాస్త స్థిరంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
- ●HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం
- ●Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్
- ●Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..
- ●Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ●Baby Sold | 48 గంటల్లోనే మూడింతలైన ధర.. నెల వయసున్న బాబును రూ.1.20 లక్షలకు కొని.. రూ.3.50 లక్షలకు అమ్మేశారు
- ●LPG Cylinder Rules | రేపటి నుంచి మారనున్న గ్యాస్ సిలిండర్ నిబంధనలు.. ఇకపై వారికి కమర్షియల్ ధరకే!

HCU | హెచ్‌సీయూపై ఎస్ఎఫ్ఐ జెండా.. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా దిల్షాదా విజయం

Donald Trump | AI కాదు.. SI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు మార్చేసిన ట్రంప్

Lava Shark 2 Pro 5G | భారీ బ్యాటరీతో లాంచ్ అయిన లావా మొబైల్స్ బడ్జెట్ ఫోన్.. ప్రత్యేక ఏఐ కూడా..

Emergency Landing | టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్






