త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayatollah Ali Khamenei | ట్రంప్ బెదిరింపులు.. బంక‌ర్‌లోకి మ‌కాం మార్చిన ఖ‌మేనీ..!

Ayatollah Ali Khamenei | అగ్ర‌రాజ్యం అమెరికా బెదిరింపుల మ‌ధ్య ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ అయతుల్లా అలీ ఖమేనీ రాజధాని టెహ్రాన్‌లోని ఓ బంక‌ర్‌లోకి మ‌కాం మార్చారు. ఖ‌మేనీ బాధ్య‌త‌ల‌ను కార్యాల‌యంలో ఆయ‌న మూడో కుమారుడు మ‌సౌద్ ఖ‌మేనీ నిర్వ‌హిస్తున్నారు.

P

International | Published On Jan 25, 2026, 3.44 pm IST

Ayatollah Ali Khamenei | ట్రంప్ బెదిరింపులు.. బంక‌ర్‌లోకి మ‌కాం మార్చిన ఖ‌మేనీ..!
Advertisement

Ayatollah Ali Khamenei | అగ్ర‌రాజ్యం అమెరికా బెదిరింపుల మ‌ధ్య ఇరాన్ సుప్రీం క‌మాండ‌ర్ అయతుల్లా అలీ ఖమేనీ రాజధాని టెహ్రాన్‌లోని ఓ బంక‌ర్‌లోకి మ‌కాం మార్చారు. ఖ‌మేనీ బాధ్య‌త‌ల‌ను కార్యాల‌యంలో ఆయ‌న మూడో కుమారుడు మ‌సౌద్ ఖ‌మేనీ నిర్వ‌హిస్తున్నారు. సీనియర్ ఇరాన్ అధికారులతో ఖ‌మేనీ నిరంతరం సంప్రదింపులు జ‌రుపుతున్నారు. ఇటీవ‌ల యూఎస్ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. యూఎస్ నేవీ మ‌ధ్య‌ప్రాచ్యం దేశం వైపుగా క‌దులుతోంద‌ని, అవ‌స‌ర‌మైతే చ‌ర్య‌లు తీసుకునేందుకు ఈ ప్రాంతంలో యుద్ధ‌నౌక‌ల‌ను మోహ‌రిస్తున్న‌ట్లు తెలిపారు. విమాన వాహక నౌక అబ్రహం లింకన్, గైడెడ్ మిస్సైల్స్ డిస్ట్రాయర్లు ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఉన్నాయని, ఇరాన్ వ‌ర‌కు చేరుకుంటాయ‌ని ఆ దేశ నేవీ అధికారులు వెల్ల‌డించారు. అద‌నంగా వైమానిక రక్షణ వ్యవస్థలను సైతం మోహ‌రిస్తున్నారు.

అమెరికా చర్యల‌కు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ జనరల్ మొహమ్మద్ పక్‌పూర్ స్పందించారు. ఇరాన్ దళాలు గ‌తంలో కంటే మెరుగ్గా సిద్ధంగా ఉన్నాయ‌న్నారు. తాము సుప్రీం లీడ‌ర్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామ‌న్నారు. ఏ దాడినైనా పూర్తి స్థాయి యుద్ధంగా ప‌రిగ‌ణిస్తామ‌న్నారు. అత్యంత క‌ఠినంగా ఇరాన్ ప్ర‌తిస్పందిస్తుంద‌ని ఓ సీనియ‌ర్ అధికారి తెలిపారు. దేశంలో నిరసనలు, సైనిక ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో సంక్షోభం ముదురుతున్న‌ది. ఆర్థిక సంక్షోభానికి తోడు, రియాల్ విలువ ప‌త‌న‌మ‌వుతున్న‌ది. దాంతో ఇరాన్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు తీవ్ర‌మ‌య్యాయి. భద్రతా దళాలు విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశాయి. 43 మంది పిల్లలు, 40 మంది పౌరులు సహా ఇప్పటివరకు కనీసం 5,002 మంది మరణించారని అమెరికాకు చెందిన హెచ్ఆర్ఏఎన్ఏ తెలిపింది. దాదాపు ఇప్ప‌టి వ‌ర‌కు 26,541 మంది నిర‌స‌న‌కారుల‌ను అరెస్టు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement