త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంట‌రిగా మిగిలిపోతావ్ జాగ్ర‌త్త‌.. నెత‌న్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్‌

Donald Trump | ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి బెంజ‌మిన్ నెత‌న్యాహు (Benjamin Netanyahu)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మ‌ళ్లీ సైనిక చ‌ర్య‌కు దిగితే.. ఒంట‌రిగా మిగిలిపోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

D

International | Published On Jun 9, 2026, 12.32 pm IST

Donald Trump | ఇరాన్‌పై దాడి చేస్తే.. ఒంట‌రిగా మిగిలిపోతావ్ జాగ్ర‌త్త‌.. నెత‌న్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్‌
Advertisement

Donald Trump | ఇజ్రాయెల్ ప్ర‌ధాన మంత్రి బెంజ‌మిన్ నెత‌న్యాహు (Benjamin Netanyahu)కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మ‌ళ్లీ సైనిక చ‌ర్య‌కు దిగితే.. ఇజ్రాయెల్ ఏకాకిగా మిగిలిపోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఈ విష‌యాన్ని ట్రంపే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

ఇరాన్‌తో ఒప్పందానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉన్నామ‌ని.. దాడులు చేయొద్దంటూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) ఎంత చెప్పినా ఇజ్రాయెల్ విన‌డం లేదు. టెహ్రాన్‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ భీక‌ర దాడులు కొన‌సాగిస్తోంది. సోమ‌వారం ఉద‌యం టెహ్రాన్‌ను ల‌క్ష్యంగా చేసుకొని ఐడీఎఫ్ ద‌ళాలు విరుచుకుప‌డ్డాయి. దీంతో ఇరాన్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ పేలుడు శ‌బ్దాలు వినిపించాయి. ఇక ఐడీఎఫ్ దాడుల‌పై ఇరాన్ సైతం ప్ర‌తీకార దాడుల‌కు దిగింది. టెల్ అవీవ్‌పై క్షిప‌ణుల వ‌ర్షం కురిపించింది. దీంతో ఇరు దేశాల మ‌ధ్య భీక‌ర పోరు కొన‌సాగింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన‌ ట్రంప్ దాడులు ఆపాలంటూ ఇజ్రాయెల్‌ను కోరారు. ఇరాన్ సైతం వెన‌క్కి త‌గ్గాల‌ని సూచించారు.

ఈ క్ర‌మంలో మ‌రోసారి ఇరాన్‌పై సైనిక చ‌ర్య‌కు దిగితే ఇజ్రాయెల్ ఒంట‌ర‌య్యే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు. ఓ ఇంట‌ర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. "నేను బీబీ (నెతన్యాహు)తో ఫోన్‌లో మాట్లాడాను. నువ్వు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పాను. లేదంటే త్వ‌ర‌లోనే నువ్వు ఒంట‌రిగా మిగిలిపోతావ‌ని" హెచ్చ‌రించాను అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య మళ్లీ పోరాటం మొదలైతే (ఇరాన్‌-ఇజ్రాయెల్‌)..టెహ్రాన్‌తో దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు దెబ్బతింటాయని తాను ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు ట్రంప్ వివ‌రించారు.

Also Read..

కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ కుమార్తెకు ఈడీ స‌మ‌న్లు

స‌గం కొరికిన యాపిల్స్‌ను జ‌నంపైకి విసిరిన సీఎం డీకే శివ‌కుమార్‌.. నెట్టింట దుమారం

హ‌ర్మూజ్ స‌మీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్ట‌ర్‌

Advertisement
Advertisement