త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anaswara Rajan | అచ్చం చిన్న కేరళలా అనిపించింది : అనస్వర రాజన్‌

Anaswara Rajan | తెలుగు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమకు హీరోయిన్‌ అనస్వర రాజన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘అంతా రాములోరు చూసుకుంటారు’ సినిమా కోసం గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ చేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. గోదావరి ప్రాంతం తనకు అచ్చం చిన్న కేరళలా అనిపించిందని చెప్పారు. అక్కడి ప్రజలు, ఆహారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. మూవీ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో అనస్వర రాజన్‌ మాట్లాడారు.

P

Entertainment | Published On Sep 6, 2026, 3.28 pm IST

Anaswara Rajan | అచ్చం చిన్న కేరళలా అనిపించింది : అనస్వర రాజన్‌
Advertisement

Anaswara Rajan | తెలుగు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమకు హీరోయిన్‌ అనస్వర రాజన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ‘అంతా రాములోరు చూసుకుంటారు’ సినిమా కోసం గోదావరి జిల్లాల్లో షూటింగ్‌ చేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. గోదావరి ప్రాంతం తనకు అచ్చం చిన్న కేరళలా అనిపించిందని చెప్పారు. అక్కడి ప్రజలు, ఆహారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. మూవీ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమంలో అనస్వర రాజన్‌ మాట్లాడారు. “ప్రస్తుతం నా మనసులో ఉన్న విషయాలను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కానీ మన మధ్య కాస్త భాష సమస్య ఉందని నాకు తెలుసు. అందుకే నేను మలయాళంలో చెప్పే దాన్ని గోదావరి యాసలో తెలుగులోకి అనువదించడానికి మారుతి (సంగీత్) సహాయం తీసుకోబోతున్నాను” అని తెలిపింది. తన మలయాళం సినిమాలకే కాకుండా తెలుగు సినిమాలకు కూడా ప్రేక్షకులు ఎంతో ప్రేమను అందిస్తున్నారని అనస్వర చెప్పారు. “మీరు నాకు చాలా ప్రేమను అందించారు. దానికి మీకు చాలా చాలా ధన్యవాదాలు” అని చెప్పింది.

అచ్చం చిన్న కేరళలా అనిపించింది..

సినిమా షూటింగ్‌ కోసం గోదావరి జిల్లాల్లో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు అన‌స్వ‌ర‌. “మేము గోదావరి జిల్లాలో షూటింగ్‌ చేశాం. అది చాలా అందమైన ప్రదేశం, మంచి మనసున్న ప్రజలు.. అచ్చం ఒక చిన్న కేరళలా అనిపిస్తుంది. అక్కడ షూటింగ్‌ చేస్తున్నంత సేపు మేము చాలా ఎంజాయ్‌ చేశాం” అని చెప్పింది. అక్కడి ఆహారం కూడా తనకు బాగా నచ్చిందని తెలిపారు. ముఖ్యంగా ‘తపేశ్వరం కాజా’ చాలా చాలా బాగుంది. నాకు అది చాలా నచ్చింది. చాలా సంతోషంగా, మంచి ఆహారం తింటూ, మంచి వ్యక్తుల మధ్య ఈ ప్రదేశంలో మేము షూటింగ్‌ పూర్తి చేశాం” అని చెప్పుకొచ్చింది.

‘నా తెలుగు అర్థమవుతోందా?’

తనకు కొంచెమే తెలుగు తెలుసని చెబుతూ.. తన మాటలను ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు అనస్వర తెలిపింది. “నాకు కొంచెం కొంచెం తెలుగు తెలుసు. నా ఈ సగం సగం తెలుగును మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను, అవునా?” అంటూ అభిమానులను ఉత్సాహ‌ప‌రిచింది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులకు నచ్చిందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సినిమా థియేటర్లలో ప్రతి క్షణం ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని అన్నారు. ఇంకా సినిమా షూటింగ్‌ పూర్తికాలేదని చెబుతూ.. తాను నేర్చుకున్న తెలుగు వాక్యాన్ని అభిమానులతో పంచుకున్నారు. “మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్‌కు వచ్చి ఈ సినిమా ఎంజాయ్‌ చేయాలని అనుకుంటున్నాను” అంటూ చెప్పింది.

‘శిరీష‌, మారుతితో ప్రేమలో పడతారు..

సినిమాలోని శ్రీష, మారుతి పాత్రలను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారని అనస్వర రాజన్‌ అన్నారు. “మీరందరూ శిరీష‌, మారుతి పాత్రలతో ప్రేమలో పడతారని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. ‘అంతా రాములోరు చూసుకుంటారు’ గ్లింప్స్‌ విడుదల కార్యక్రమానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. చివరగా “ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు! లవ్‌ యు!” అంటూ ముగించింది.

సంతోష్ శోభ‌న్ హీరో..

అంతా రాములోరు చూసుకుంటారు మూవీలో సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తుండ‌గా.. ‘కుమారి 21ఎఫ్‌’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పల్నాటి సూర్యప్రతాప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌, ఎమోషన్స్‌, ఫ్యామిలీ అంశాలను మేళవిస్తూ ఆహ్లాదకరమైన కథాంశంతో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌, వీజీబీ ఫిల్మ్స్‌ బ్యానర్లపై ధీరజ్‌ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్‌, రోహిణి, రఘుబాబు, అలీ, ఝాన్సీ, వినోద్‌ కుమార్‌, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

Advertisement
Advertisement