Ponnam Prabhakar | గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. త్వరలోనే నీళ్లు నింపే బాధ్యత నాదే: పొన్నం
Ponnam Prabhakar | గౌరవెల్లి కాలువల భూసేకరణకు పరిహారం అందిస్తూ పనులను వేగవంతం చేస్తున్నామని.. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెలో ప్రజా పాలన”లో భాగంగా ఆదివారం భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి, ముత్తారం గ్రామాల్లో ఆయన పర్యటించారు.
Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: గౌరవెల్లి కాలువల భూసేకరణకు పరిహారం అందిస్తూ పనులను వేగవంతం చేస్తున్నామని.. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో “పల్లె పల్లెకు పొన్నం అన్న- పల్లె పల్లెలో ప్రజా పాలన”లో భాగంగా ఆదివారం భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి, ముత్తారం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గొల్లపల్లి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గొల్లపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. గ్రామానికి ఓపెన్ జిమ్, వాటర్ ప్లాంట్ మంజూరు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం. స్థల సేకరణ పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, మహిళా భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తాం.
రైతులు ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలి. ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు నిర్మించుకుని నీటిని సంరక్షించాలి. యువత క్రీడల్లో రాణించేలా అవసరమైన క్రీడా సామగ్రిని అందిస్తున్నాం. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపుతూ గొల్లపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం నా బాధ్యత అని పొన్నం పేర్కొన్నారు.
ముత్తారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం. ముత్తారం చౌరస్తా నుంచి గట్ల నర్సింగాపూర్ మీదుగా లంబాడీ తండా వరకు రూ.3.74 కోట్లతో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. ప్రజా పాలనలో భాగంగా గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. ముత్తారం గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, మహిళా సంఘాలకు రుణాలు తదితర సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
గ్రామంలో ఇంకుడు గుంతలు, ఆయిల్‌పామ్ సాగు, సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి స్టీల్ బ్యాంకులను వినియోగించాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు, యువత క్రీడల్లో రాణించేలా అవసరమైన క్రీడా సామగ్రి, ఓపెన్ జిమ్ వంటి సదుపాయాలు కల్పించాం. ముత్తారం గ్రామానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను కాపాడుతూ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్య రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టి గ్రామాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తాం అని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






