Mee Seva | మీ-సేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్.. ఎంత చెల్లించాలంటే?
Mee Seva | యూరియా యాప్‌తో (Urea) ముప్పుతిప్పలు పడుతున్న అన్నదాతలకు (Farmers) ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసింది.
Mee Seva | త్రినేత్ర.న్యూస్: యూరియా యాప్‌తో (Urea) ముప్పుతిప్పలు పడుతున్న అన్నదాతలకు (Farmers) ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేసింది. మీ-సేవ (Mee Seva) కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్‌ను ప్రారంభించింది. దీనికోసం రైతులు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. రైతుల వెసులుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ, సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం యూరియా బుకింగ్ సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో అందుబాటులో ఉందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించింది.
ఎలా బుక్ చేసుకోవాలంటే?
- రైతు తన పట్టాదారు పాస్‌బుక్ నంబర్‌తో సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి.
- మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం మరియు పంట వివరాలను నమోదు చేస్తారు.
- రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు.
- రైతు నమోదిత మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని ధృవీకరించిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది.
- మీ సేవ ద్వారా పొందిన బుకింగ్ ఐడి బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
- బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి.
- సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.
ఓటీపీ అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్ బుక్ తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి. ఏవైనా సందేహాలు లేదా సహాయం కోసం సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (AEO), మండల వ్యవసాయ అధికారి (MAO) లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





