త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Security Chief Ali Larijani Killed | ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజానీ హతం?

ఇరాన్ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ, కీలక కమాండర్ అలీ లారిజానీ ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. అయితే, ఇరాన్ మీడియా మాత్రం లారిజానీ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

J

International | Published On Mar 17, 2026, 4.24 pm IST

Iran Security Chief Ali Larijani Killed | ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజానీ హతం?
Advertisement

Iran Security Chief Ali Larijani Killed | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఇరాన్ జాతీయ భద్రతా మండలి (Supreme National Security Council) సెక్రటరీ, ఆ దేశ అత్యున్నత నేతల్లో ఒకరైన అలీ లారిజానీ (Ali Larijani) ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కోడై కూస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా ధృవీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక కథనం ప్రచురించింది.

ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ

ఒకవేళ లారిజానీ మరణం నిజమైతే, యుద్ధం మొదటి రోజున మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ కోల్పోయిన అత్యంత కీలకమైన, సీనియర్ నాయకుడు ఆయనే అవుతారు. గతంలో అణు ఒప్పందాల సంధానకర్తగా పనిచేసిన లారిజానీ, ఇరాన్ అధికార యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. శుక్రవారం టెహ్రాన్‌లో జరిగిన ఖుద్స్ డే (Quds Day) ర్యాలీలో ఆయన చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. అదే రోజు.. లారిజానీ సహా 10 మంది ఇరాన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ఇస్తే 10 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.83 కోట్లు) భారీ రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించడం గమనార్హం. మరోవైపు, ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో బాసిజ్ (Basij) రెసిస్టెన్స్ ఫోర్స్ చీఫ్ గులాంరెజా సులేమానీతో పాటు ఇతర సీనియర్ నాయకులను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.

ఇరాన్ మీడియా కౌంటర్.. ట్రంప్‌పై విమర్శలు

ఇజ్రాయెల్ ప్రకటనలపై ఇరాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, మంగళవారం ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ'.. లారిజానీ పేరుతో ఉన్న ఒక సంచలన ప్రకటనను విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

"లక్షలాది మంది ఇరానియన్లు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన చిత్రాలుగా ట్రంప్ కొట్టిపారేయడం విడ్డూరం. 47 ఏళ్ల క్రితం ఇస్లామిక్ విప్లవం సమయంలో పహ్లావీ పాలకులు కూడా ఇలాగే మాట్లాడారు. ఎప్‌స్టీన్ ఐలాండ్ (Epstein's Island) అవశేషాలపై ఇరాన్ ప్రజల చరిత్రాత్మక విజయం త్వరలోనే సాకారం కానుంది" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ముస్లిం దేశాలకు లారిజానీ పిలుపు

అంతకుముందు సోమవారం, ముస్లిం దేశాలను ఉద్దేశించి లారిజానీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ఇరాన్‌పై దాడులు జరుగుతున్నప్పుడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడం పట్ల ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

"ఇరాన్‌ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా అమెరికా-జియోనిస్ట్ శక్తులు ద్రోహపూరిత దాడులకు పాల్పడ్డాయి. ఈ దాడిలో ఇస్లామిక్ విప్లవ గొప్ప నాయకుడు, పలువురు పౌరులు, సైనిక కమాండర్లు అమరులయ్యారు. ఎన్ని దాడులు జరిగినా అమెరికా, ఇజ్రాయెల్‌పై మా పోరాటం తిరుగులేనిది" అని లారిజానీ అందులో స్పష్టం చేశారు.

ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే ఆయన మరణవార్త రావడం పశ్చిమాసియాలో తీవ్ర కలకలం రేపుతోంది.

https://x.com/PressTV/status/2033819233713316329

 

Advertisement

తాజావార్తలు

Advertisement