Iran Apologises To Gulf Countries | ఇకపై దాడులు చేయం.. క్షమించండి.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు
Iran Apologises To Gulf Countries | గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పింది. ఇకపై దాడులు చేయమని స్పష్టం చేసింది. ఇరాన్ టెలివిజన్‌తో అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్ (Masoud Pezeshkian) మాట్లాడుతూ ఈ మేరకు క్షమాపణలు చెప్పారు.
International | Published On Mar 7, 2026, 3.03 pm IST
Iran Apologises To Gulf Countries | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను పెంచింది. అదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ చేపడుతున్న ఈ దాడులపై గల్ఫ్ దేశాలు (Gulf Countries) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పింది. ఇకపై దాడులు చేయమని స్పష్టం చేసింది.
ఇరాన్ టెలివిజన్‌తో అధ్యక్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియన్ (Masoud Pezeshkian) మాట్లాడుతూ ఈ మేరకు క్షమాపణలు చెప్పారు. ఇకపై గల్ఫ్ దేశాలపై దాడులు చేయకూడదని ఇరాన్ మధ్యంతర నాయకత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించమని తెలిపారు. అయితే, ఆయా దేశాలు ఇరాన్‌పై దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అమెరికాకు లొంగిపోయేది లేదు..
మరోవైపు ఇరాన్‌తో ఎలాంటి చర్చలూ, ఒప్పందాలు ఉండవని బేషరతుగా లొంగిపోవాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మసౌద్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ ఏ దేశానికీ లొంగిపోదని స్పష్టం చేశారు. ఇరాన్ లొంగిపోవాలనుకునే వారి కోరికను వారి సమాధులపైకి మళ్లిస్తాం అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైల్స్..
అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ గట్టిగా బదులిస్తోంది. ముఖ్యంగా దుబాయ్, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. ఈ దాడులతో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మాపై దాడులు ఏంటని గల్ఫ్ నాయకులు ఇరాన్‌పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పింది.
Also Read..
Sundar Pichai | భారీగా పెరిగిన గూగుల్ సీఈవో పిచాయ్ వేతనం.. ఎంతంటే..?
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



