Missile strikes | ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా ఇరాన్ దాడులు.. 100మందికిపైగా గాయాలు
Missile strikes | ఇజ్రాయెల్‌పై ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel) అణుపరిశోధన కేంద్రం (Nuclear Research Center) సమీపంలోని డిమోనా (Dimona), అరద్ (Arad) నగరాలపై వరుస క్షిపణి దాడులతో (Missile strikes) విరుచుకుపడింది.
International | Published On Mar 22, 2026, 9.25 am IST
Missile strikes | త్రినేత్ర.న్యూస్: ఇజ్రాయెల్‌పై ఇరాన్ (Iran) ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ (Israel) అణుపరిశోధన కేంద్రం (Nuclear Research Center) సమీపంలోని డిమోనా (Dimona), అరద్ (Arad) నగరాలపై వరుస క్షిపణి దాడులతో (Missile strikes) విరుచుకుపడింది. దీంతో చిన్నారులు సహా 100 మందికిపైగా గాయపడ్డారు. అరాద్‌లోనే 88 మంది గాయపడ్డారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దంతో ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది.

ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు రాగా, వాటిని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డిమోనా, అరాద్ నగరాల్లోని నివాస ప్రాంతాలపై క్షిపణులు పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డిమోనాలోని షిమోన్ పెరెస్ నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తామని చెప్పారు. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన కఠిన సమయమని తెలిపారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

https://x.com/clashreport/status/2035454348075884830
https://x.com/clashreport/status/2035465847372665317
https://x.com/clashreport/status/2035480672958022041
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



