త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pakistan Selene Ship | పాకిస్థాన్‌కి షాకిచ్చిన ఇరాన్.. హార్ముజ్‌ వద్ద పాక్ నౌకను అడ్డుకున్న ఐఆర్‌జీసీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను కఠినతరం చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని పాక్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరుగడం గమనార్హం.

J

International | Published On Mar 25, 2026, 5.01 pm IST

Pakistan Selene Ship | పాకిస్థాన్‌కి షాకిచ్చిన ఇరాన్.. హార్ముజ్‌ వద్ద పాక్ నౌకను అడ్డుకున్న ఐఆర్‌జీసీ
Advertisement

Pakistan Selene Ship | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడిన విషయం తెలిసిందే. ఆ జలసంధి గుండా కొన్ని దేశాల షిప్పులకే ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ నౌక ఆ రూట్ గుండా వెళ్తుండగా ఇరాన్ అడ్డుకుంది. పాక్‌కు వెళ్తున్న కంటైనర్ షిప్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అడ్డుకుంది.

సెలెన్ అనే పేరు గల ఈ కంటైనర్ నౌక సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ జెండాతో ప్రయాణిస్తోంది. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచి పాకిస్థాన్‌లోని కరాచీకి ఆహార సామాగ్రిని తీసుకెళ్తోంది. హార్ముజ్ దాటేందుకు ఈ నౌక ప్రయత్నిస్తుండగా ఇరాన్ దళాలు అడ్డుకొని ఆ నౌకను తిరిగి వెనక్కి పంపించాయి.

కారణం ఏంటి?

సముద్రయానానికి అవసరమైన ముందస్తు రవాణా అనుమతులు లేకపోవడం, చట్టపరమైన ప్రోటోకాల్స్ పాటించకపోవడం వల్లనే ఆ నౌకను అడ్డుకున్నట్లు ఇరాన్ తెలిపింది. హార్ముజ్ మార్గంలో ప్రయాణించే ఏ నౌక అయినా ఇరాన్ మెరిటైమ్ అథారిటీతో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ తన నియంత్రణను కఠినతరం చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని పాక్ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన జరుగడం గమనార్హం. ఈ పరిణామంతో అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలపై మరింత ఆందోళన నెలకొన్నది.

Advertisement

తాజావార్తలు

Advertisement