త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran | బాలికల మృతికి కార‌ణం ఈ ఇద్ద‌రే.. ఉగ్ర‌వాదులుగా పేర్కొంటూ ఫొటోలు రిలీజ్ చేసిన ఇరాన్‌..!

Iran | ఇరాన్‌ మినాబ్‌ నగరంలోని బాలిక పాఠ‌శాల‌పై జరిగిన ఘోర దాడికి అమెరికా అధికారులే బాధ్యులని ఇరాన్‌ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అమెరికా నౌకాదళ అధికారులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ వారి ఫొటోలను విడుదల చేసింది.

P

International | Published On Mar 29, 2026, 6.14 pm IST

Iran | బాలికల మృతికి కార‌ణం ఈ ఇద్ద‌రే.. ఉగ్ర‌వాదులుగా పేర్కొంటూ ఫొటోలు రిలీజ్ చేసిన ఇరాన్‌..!
Advertisement

Iran | ఇరాన్‌ మినాబ్‌ నగరంలోని బాలిక పాఠ‌శాల‌పై జరిగిన ఘోర దాడికి అమెరికా అధికారులే బాధ్యులని ఇరాన్‌ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అమెరికా నౌకాదళ అధికారులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ వారి ఫొటోలను విడుదల చేసింది. భార‌త్‌లోని ఇరాన్ రాయ‌బార కార్యాల‌యంలో ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేసింది. ఇద్ద‌రు నేవీ అధికారుల ఫొటోల‌ను రిలీస్ చేస్తూ.. "ఈ ఇద్దరు నేరస్తులను గుర్తించండి. కమాండర్ లీ ఆర్ టేట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్రీ ఇ యార్క్. మినాబ్‌లోని ఒక పాఠశాలలో 168 మంది అమాయ‌క బాలిక‌ల‌ను చంపిన టోమాహాక్ మిస్సైల్స్‌ను మూడుసార్లు ప్రయోగించమని వారు ఆదేశించారు" అని పేర్కొంది.

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ ఫొటోలు రిలీజ్ చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మినాబ్‌లోని బాలికల పాఠశాలపై వరుసగా మూడు టొమాహాక్‌ క్షిపణులు దూసుకెళ్లడంతో క్షణాల్లోనే పాఠశాల భవనం శిథిలమైంది. చిన్నారులు మృతి చెందిన ఈ ఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ దాడిలో అత్యంత భయంకర అంశంగా “ట్రిపుల్‌ టాప్‌” వ్యూహాన్ని ఉపయోగించడం. మొదటి క్షిపణి పడిన వెంటనే సహాయక చర్యల కోసం వచ్చిన స్థానికులు, రక్షణ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని మరో రెండు క్షిపణులు ప్ర‌యోగించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ విధానంతో మ‌రింత ప్రాణ‌న‌ష్టం క‌లిగించే దీని ఉద్దేశ‌మ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో యూఎస్‌ఎస్‌ స్ప్రూయాన్స్‌ నౌకకు చెందిన అధికారులపై ఇరాన్‌ నేరారోపణలు మోపింది. కమాండింగ్‌ ఆఫీసర్‌గా లీ ఆర్ టేట్ మిస్సైల్ దాడులకు ఆదేశాలు ఇచ్చారని, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జెఫ్రీ ఈ యార్క్‌ ఈ ఆపరేషన్‌ను ప్రణాళిక చేశారని ఆరోపించింది. అయితే, ఈ ఘటనపై అమెరికా సైన్యం స్పందిస్తూ లక్ష్యాన్ని గుర్తించడంలో పొరపాటు జరిగిందని తెలిపింది. పాత గూఢచారి సమాచారం ఆధారంగా ఆ ప్రాంతాన్ని ఇరాన్‌ సైనిక స్థావరంగా భావించినట్లు వెల్లడించింది. కానీ, ఈ వివరణను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పూర్తిగా తిరస్కరించినట్లు సమాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement