Modi | ఇథియోపియా అభివృద్ధిలో భారతీయులది కీలక పాత్ర: మోదీ
Modi | ఇథియోపియా (Ethiopia)లో పర్యటిస్తున్న ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Modi) ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ దేశ అభివృద్ధిలో భారతీయులది కీలక పాత్ర అని అన్నారు.
International | Published On Dec 17, 2025, 1.17 pm IST
Modi | ఇథియోపియా (Ethiopia) అభివృద్ధిలో భారతీయులది కీలక పాత్ర అని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Modi) అన్నారు. దాదాపు రెండు వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు హిందూమహాసముద్రం మీదుగా సుగంధ ద్రవ్యాలు, బంగారం వాణిజ్యం జరిగేదని అన్నారు. 1941లో ఇథియోపియా విముక్తి కోసం భారతీయ సైనికులు ఇథియోపియన్లతో కలిసి పోరాడారని గుర్తు చేశారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఇథియోపియాకు చేరుకుని, ఆ దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా ను స్వీకరించారు. అనంతరం ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇథియోపియాలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు. సింహాల భూమి అయిన ఇథియోపియాకు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఆ దేశంతో భారత్‌కు సత్సంబంధాలున్నాయని అన్నారు. ప్రపంచమంతా వసుధైక కుటుంబమైందని, భారతీయ టీచర్లు చాలా మంది ఇథియోపియాలో సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇథియోపియాలో అత్యధిక విదేశీ పెట్టుబడిదారులుగా భారతీయులే ఉన్నారని, వీరు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






