త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | ఆటోలో భార్య చెవి కమ్మలు వేలాడదీసి.. మగాళ్ల ప్రేమ ఇంత స్వచ్ఛంగా ఉంటుందా? వీడియో వైరల్

తన భార్య అంటే ప్రాణమని, తనను చూడకుండా నిమిషం కూడా ఉండలేనని, పనికి వెళ్లడం తప్పదు కాబట్టి తన చెవి కమ్మలను ఆటోలో ఉంచుకుంటే ఆమె తన పక్కనే ఉన్నట్టు ఫీల్ ఉంటుందని అసలు విషయం చెప్పాడు.

J

Viral news | Published On Feb 21, 2026, 8.23 pm IST

Viral Video | ఆటోలో భార్య చెవి కమ్మలు వేలాడదీసి.. మగాళ్ల ప్రేమ ఇంత స్వచ్ఛంగా ఉంటుందా? వీడియో వైరల్
Advertisement

Viral Video | కట్టుకున్న భార్యను ఎవరైనా ప్రేమిస్తారు. కానీ.. అంతకు మించి అని చెప్పాలంటే ఈ ఘటనే ఉదాహరణ. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్లినప్పుడు భార్యను కూడా ఆఫీసుకు తీసుకెళ్లలేం. బిజినెస్ అయినా ఇంకే పని అయినా భార్యను ఇంట్లోనే ఉంచి పనులకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఓ ఆటో డ్రైవర్ తన భార్య మీద ఉన్న ప్రేమను వెరైటీగా చూపించాడు. తను ఆటో నడిపే సమయంలో కూడా భార్య ప్రేమ మెమోరీస్‌తో నిండాలని, తను 24 గంటలు తన పక్కనే ఉండేలా ఫీల్ అవ్వాలని తన చెవి కమ్మలను తీసుకొచ్చి ఆటో లోపల వేలాడదీశాడు.

ఓ యువతి ఇటీవల తన ఆటో ఎక్కి ఆటోలో వేలాడుతున్న చెవి కమ్మలను చూసి ఆశ్చర్యపోయింది. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏంటి ఈ చెవి కమ్మల మ్యాటర్ అని అతడిని అడగడంతో ఆ ఆటో డ్రైవర్ తన భార్య మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచాడు. తన భార్య అంటే ప్రాణమని, తనను చూడకుండా నిమిషం కూడా ఉండలేనని, పనికి వెళ్లడం తప్పదు కాబట్టి తన చెవి కమ్మలను ఆటోలో ఉంచుకుంటే ఆమె తన పక్కనే ఉన్నట్టు ఫీల్ ఉంటుందని అసలు విషయం చెప్పాడు. ఆ వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sula (@marilyn.sultana.akand)

Advertisement
Advertisement