India | బంగ్లాదేశ్‌కు 5వేల టన్నుల డీజిల్‌ను పంపిన భారత్.. ఒప్పందంలో భాగంగానే..
India | ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు భారత్ పెద్ద ఎత్తున డీజిల్ సరఫరా చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్ 5వేల టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు పంపించింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాధారణ ఇంధన వాణిజ్యంలో భాగంగానే ఈ సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
International | Published On Mar 11, 2026, 9.39 am IST
India | ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రమైన ఇంధన కొరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్‌కు భారత్ పెద్ద ఎత్తున డీజిల్ సరఫరా చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో భారత్ 5వేల టన్నుల డీజిల్‌ను బంగ్లాదేశ్‌కు పంపించింది. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సాధారణ ఇంధన వాణిజ్యంలో భాగంగానే ఈ సరఫరా జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో బంగ్లాదేశ్ ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. భారత్ నుంచి డీజిల్ సరఫరా అందినట్లు బంగ్లాదేశ్ అధికారికంగా ధ్రువీకరించింది. అదనంగా మరిన్ని సరఫరాలు చేయాలని కూడా భారత్‌ను కోరినట్లు సమాచారం.
ఏడాదికి 1.80 లక్షల టన్నుల డీజిల్ సరఫరాకు ఒప్పందం..
భారత్‌తో తమకు ఒక ఒప్పందం ఉందని, ఆ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం పైప్‌లైన్ ద్వారా భారత్ బంగ్లాదేశ్‌కు 1.80 లక్షల టన్నుల డీజిల్ ను సరఫరా చేస్తుందని, ఇప్పుడు వచ్చిన 5వేల టన్నుల డీజిల్ కూడా అదే ఒప్పందంలో భాగం అని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) చైర్మన్ మహమ్మద్ రెజానుర్ రహ్మాన్ తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో కనీసం 90వేల టన్నుల డీజిల్ ను బంగ్లాదేశ్‌కు భారత్ పంపించాల్సి ఉంటుందని, ఇప్పుడు 5వేల టన్నుల డీజిల్ వచ్చిందని, వచ్చే రెండు నెలల్లో ఆరు నెలల కోసం అవసరమైన మొత్తం డీజిల్‌ను పంపిస్తారని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
2017 నుంచే..
భారత్-బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ కార్యక్రమం కింద భారత్ బంగ్లాదేశ్‌కు డీజిల్ సరఫరా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ 2017లో ప్రారంభమై అమల్లోకి వచ్చింది. ఈ పథకం కింద అస్సాంలోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి వాణిజ్య పద్ధతిలో ఇంధనం సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే బంగ్లాదేశ్ చేసిన అదనపు సరఫరా అభ్యర్థనను ఇంధన లభ్యత, మార్కెట్ పరిస్థితులను బట్టి పరిశీలిస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పటికీ భారత్‌లో ఇంధన కొరత లేదని కేంద్రం ఇప్పటికే భరోసా ఇచ్చింది.
కాగా తీవ్రమవుతున్న ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పలు కఠిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తాత్కాలికంగా మూసివేసింది. ఇంధన నిల్వలను స్థిరపరచేందుకు గత వారం ఇంధన పంపిణీ కేంద్రాల్లో జరిగిన ఆందోళనాత్మక కొనుగోళ్ల నేపథ్యంలో ప్రభుత్వం రోజువారీ ఇంధన విక్రయాలపై కఠిన పరిమితులు కూడా విధించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026

TeamIndia | 600వ టెస్ట్.. టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్న గిల్
ఆగస్టు 15, 2026

Stock Markets | భారీగా పెరిగిన చమురు ధరలు.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



