త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil Purchase | ఆ సేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా భారత్ చమురు కొనొచ్చు: రష్యా

Oil Purchase | భార‌త్ (India), అమెరికా (US)మ‌ధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో ర‌ష్యా (Russia) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను (Oil Purchase) నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న‌కు మాటిచ్చార‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump) వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

G

International | Published On Feb 5, 2026, 8.50 am IST

Oil Purchase | ఆ సేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా భారత్ చమురు కొనొచ్చు: రష్యా
Advertisement

Oil Purchase | త్రినేత్ర‌.న్యూస్‌: భార‌త్ (India), అమెరికా (US)మ‌ధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో ర‌ష్యా (Russia) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను (Oil Purchase) నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న‌కు మాటిచ్చార‌ని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ (Donald Trump) వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. దీనిపై త‌మ‌కు అలాంటి స‌మాచారం లేద‌ని మాస్కో ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. తాజాగా వెనెజులా (Venezuela) నుంచి చ‌మురు కొనుగోళ్ల‌పై ర‌ష్యా అధ్య‌క్ష భ‌వ‌నం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు.

ప్రపంచంలో ఏ దేశం నుంచైనా భార‌త్‌ చమురును కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని, ఆ దేశానికి ఆ స్వేచ్ఛ ఉందని స్ప‌ష్టం చేశారు. విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్‌కు కొత్త కాదని పేర్కొన్నారు. భార‌త్‌కు ర‌ష్యా ఒక్క‌టే చ‌మురును స‌ర‌ఫ‌రా చేయ‌డం లేద‌న్న విష‌యం త‌మ‌తోపాటు అంత‌ర్జాతీయ ఇంధ‌న రంగ నిపుణులంద‌రికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఆ దేశం ఎప్ప‌టినుంచో ఇత‌ర దేశాల నుంచీ చ‌మురును కొనుగోలు చేస్తున్న‌ద‌ని, అందువ‌ల్ల కొనుగోళ్ల‌ను భార‌త్ నిలిపివేయ‌డం కొత్త విష‌యంగా తోచ‌డం లేద‌న్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనడాన్ని భారత రిఫైనరీలు పూర్తిగా ఆపలేవని వెల్లడించారు.

అమెరికా ఎగుమతి చేసే షేల్ చమురు తక్కువ గ్రేడ్‌లు కలిగి ఉంటుంద‌ని చెప్పారు. గ్యాస్ కూడా తక్కువ కండెన్సేట్‌తో ఉంటుంద‌న్నారు. వాటితో పోలిస్తే రష్యా ఎక్కువ గ్రేడ్ కలిగిన, సల్ఫర్ అధికంగా ఉండే యూరల్స్‌ను సరఫరా చేస్తుంద‌ని వెల్ల‌డించారు. తక్కువ గ్రేడ్లు ఉండే చమురును అమెరికా నుంచి భారత్ ఎక్కువ‌ ధరకు కొనాల్సి ఉంటుంది. అంటే రష్యాకు ప్రత్యామ్నాయం అంత సులభం కాద‌ని అర్ధ‌మ‌వుతున్న‌ది. రష్యా రోజుకు 15 నుంచి 20 లక్షల బ్యారెళ్ల చమురును సరఫరా చేస్తున్న‌ది. అంత ప‌రిమాణంలో అమెరికా చేయలేద‌ని పేర్కొన్నారు. 2022లో భార‌త్.. అమెరికా, ఇత‌ర దేశాల నుంచి చ‌మురును కొన‌డం వ‌ల్ల బ్యార‌ల్ ధ‌ర 120 డాల‌ర్ల‌కు పెరింద‌ని వివ‌రించారు. భారత్, రష్యాల మధ్య హైడ్రోకార్బన్ల వాణిజ్యం ఇరు దేశాలకు లాభదాయక‌మ‌ని తెలిపారు. ఈ రంగంలో ఇరు దేశాల మరింతగా కలిసి పని చేయాల‌ని పెస్కోవ్ ఆకాంక్షించారు.

Advertisement
Advertisement