Pakistan President Asif Ali Zardari | ఆపరేషన్ సిందూర్ టైమ్‌లో నన్ను బంకర్‌లో దాక్కోమన్నారు: పాక్ ప్రెసిడెంట్
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై మిసైళ్లతో విరుచుకుపడి ఆ క్యాంపులను నాశనం చేయడంతో పాటు వందలాది ఉగ్రవాదులను మట్టికరిపించారు.
International | Published On Dec 28, 2025, 6.55 pm IST
Pakistan President Asif Ali Zardari | పహల్గామ్ ఘటనకు దీటుగా ఇండియా.. పాక్‌పై ఎక్కు పెట్టింది. భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను ఆపరేషన్ సిందూర్‌తో నిద్రలేకుండా చేసింది. మే 7, 2025 న తెల్లవారుజామున ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించారు. ఏప్రిల్ 26న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు విచక్షణారహితంగా అక్కడి టూరిస్టులపై కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలను బలిగొన్నారు. దానికి ప్రతీకారంగా కేవలం 10 రోజుల వ్యవధిలోనే పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి వాటిని నామరూపం లేకుండా చేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కి చెందిన కీలక నేతలంతా అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు. భారత యుద్ధ విమానాలకు, మిసైళ్లకు చిక్కకుండా తలదాచుకున్నారు. అలా తనను కూడా బంకర్‌లో తలదాచుకోవాలని చెప్పారని తాజాగా పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలి జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ జరిగిన ఆ నాలుగు రోజుల పాటు తనను బంకర్‌లో తలదాచుకోవాలంటూ తన మిలిటరీ సెక్రటరీ సూచించారని అన్నారు.
సెక్రటరీ వచ్చి యుద్ధం స్టార్ట్ అయింది. బంకర్‌లోకి వెళ్దాం పదండి.. అని అన్నారు. కానీ.. నేను మాత్రం ఒప్పుకోలేదు. యుద్ధంలో అమరుడిని అయ్యేందుకు నేను సిద్ధమే. బంకర్లలో నాయకులు చనిపోకూడదు. రణరంగంలో మరణించాలి. నాకు వార్ గురించి నాలుగు రోజుల ముందే తెలుసు.. అంటూ పాకిస్థాన్ ప్రెసిడెంట్ శనివారం జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆసిమ్ మునీర్ కూడా బంకర్‌లో దాక్కున్నాడు
భారత్ ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ చేయగానే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా బంకర్‌లో దాక్కున్నాడు. పాక్ రాజకీయ ముఖ్య నేతలు, మిలిటరీ కమాండర్లు అందరూ బంకర్లలోనే ఉన్నారు. పాక్ సైనికులే యుద్ధం చేసి మృతి చెందారు. తనకు నాలుగు రోజుల ముందే ఆపరేషన్ సిందూర్ గురించి తెలుసు అని పాక్ ప్రెసిడెంట్ చెప్పడం పెద్ద అబద్ధం. ఒకవేళ నాలుగు రోజులు ముందే తెలిస్తే ఎందుకు ఒక్క మిసైల్‌ని కూడా టార్గెట్‌ని ఛేదించకుండా ఆపలేకపోయారు.. అంటూ భారత లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్.. పాక్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై మిసైళ్లతో విరుచుకుపడి ఆ క్యాంపులను నాశనం చేయడంతో పాటు వందలాది ఉగ్రవాదులను మట్టికరిపించారు. దానికి ప్రతికారంగా పాకిస్థాన్ వెంటనే మిసైళ్లు, డ్రోన్లతో భారత్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించినా వెంటనే భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ వాటిని తిప్పికొట్టింది. ఆ తర్వాత పాక్‌కి భారీ నష్టం జరుగుతోందని భావించి పాక్ కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణకి భారత్ ఒప్పుకొని మే 10న పాక్‌తో యుద్ధాన్ని విజయవంతంగా భారత్ ముగించింది.
సంబంధిత వార్తలు

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

PM Modi | దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు.. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తైన వేళ ప్రధాని పోస్ట్
మే 7, 2026

China J-35AE Fighter Jet | డ్రాగన్ కొత్త మాస్టర్ ప్లాన్: పాకిస్థాన్ చేతికి చైనా ఫైటర్ జెట్స్!
మే 6, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



