Abdul Basit | ముంబయి, ఢిల్లీ నగరాలపై దాడి చేస్తాం.. పాక్ మాజీ దౌత్యవేత్త బాసిత్ వివాదాస్పద వ్యాఖ్యలు..!
Abdul Basit | పశ్చిమాసియాలో ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోని ఢిల్లీ, ముంబయి నగరాలపై దాడి చేస్తామని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.
International | Published On Mar 22, 2026, 3.48 pm IST
Abdul Basit | పశ్చిమాసియాలో ఉద్రికత్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోని ఢిల్లీ, ముంబయి నగరాలపై దాడి చేస్తామని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, ఆ దేశంతో ముప్పు తప్పదంటూ అమెరికా జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఓ టీవీ చర్చలో మాట్లాడుతూ తులసీ గబ్బార్డ్ దృష్టికోణం పాక్‌కు వ్యతిరేకమన్నారు. ఆమె భారత్ మూలాలకు చెందిన వారని, ఆమె పాకిస్తాన్ వద్ద ఉన్న మిస్సైల్స్‌ను మాత్రమే చూస్తుందని ఆరోపించారు. భారత్ వద్ద ఉన్న అగ్ని-5, అగ్ని-6 మిస్సైల్ గురించి ప్రస్తావించరన్నారు. వాటికున్న పరిధి, స్థాయి తమ మిస్సైల్స్‌కు లేదని, అలా పెరగాలని కోరుకుంటున్నానన్నారు.
అమెరికాతో సంబంధాలపై..
భారత్‌లో పాకిస్థాన్ హైకమిషనర్‌గా పనిచేసిన బాసిత్.. భారత్ పేరును అమెరికా ప్రస్తావించకపోవడం సహజమేనని పేర్కొన్నారు. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామని, పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయని అనుకోవడంలో పూర్తిగా నిజం లేదన్నారు. ట్రంప్ వచ్చాక తర్వాత కొంత మార్పు వచ్చిందని.. దీర్ఘకాలంగా అమెరికా పాక్‌కు భాగస్వామి కాదన్నారు. ఇదే సమయంలో తులసీ గబ్బార్డ్ అమెరికా హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు సమర్పించిన 2026 వార్షిక ముప్పు అంచనాలో పాకిస్థాన్ మిస్సైల్ ప్రోగ్రామ్ అమెరికాకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాక్ అభివృద్ధి చేస్తున్న క్షిపణులు భవిష్యత్తులో అమెరికా భూభాగాన్ని కూడా తాకే సామర్థ్యం చేరుకోవచ్చని హెచ్చరించారు.
అమెరికాను చేరుకోలేకపోయినా భారత్‌పై..
ఈ నేపథ్యంలో బాసిత్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. “ఒకవేళ పరిస్థితులు అత్యంత దారుణంగా మారి, అమెరికా పాకిస్థాన్‌పై దాడి చేస్తే మన క్షిపణులు అమెరికాను చేరకపోయినా, మనకు ప్రత్యామ్నాయం ఏమిటి? అలాంటి పరిస్థితిలో భారత్‌పై దాడి చేయడమే మార్గం. ముంబయి, న్యూఢిల్లీపై దాడి చేయడంలో వెనుకాడకూడదు” అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. “ఎవరైనా పాకిస్థాన్‌పై కన్నేస్తే ఆలోచించకుండా భారత్‌పై దాడి చేస్తాం. ముంబయి, ఢిల్లీ దూరంలో లేవు. ఇంటర్నేషనల్ క్లాస్ మిస్సైల్స్ అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సమయంలో టీవీ యాంకర్ “ఇది మనం ఇంతకుముందే చేసి చూపించాం” అని చెప్పగా, బాసిత్ “మేం ఇంతకుముందు చేశాం. మళ్లీ చేస్తాం” అని చెప్పడం 26/11 ముంబై ఉగ్రదాడులను మళ్లీ తెరపైకి తెచ్చింది. బాసిత్ వ్యాఖ్యలు మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో పని చేసిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
https://x.com/AdityaRajKaul/status/2035612194881339421
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






