UK PM | బ్రిటన్ రాజకీయాలను కుదిపేస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్.. కదులుతున్న కీర్ స్టార్మర్ పీఠం.. యూకేకి తొలి ముస్లిం ప్రధానిగా కశ్మీర్ మహిళ..?
UK PM| అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Epstein files) సెక్స్ కుంభకోణం వ్యవహారం ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ సెక్స్ కుంభకోణం వ్యవహారం ముఖ్యంగా బ్రిటన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది.
International | Published On Feb 10, 2026, 12.26 pm IST
UK PM| అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Epstein files) సెక్స్ కుంభకోణం వ్యవహారం ప్రపంచ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ సెక్స్ కుంభకోణం వ్యవహారం ముఖ్యంగా బ్రిటన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఏకంగా రాజకీయ సంక్షోభం తలెత్తే పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రధాన మంత్రి (UK PM) పీఠమే కదిలేలా ఉంది.
అమెరికాలో బ్రిటన్ మాజీ రాయబారి పీటర్ మాండెల్సన్‌కు ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నట్లు బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) చిక్కుల్లో పడాల్సి వచ్చింది. అతని గురించి తెలిసినా కూడా మాండెల్సన్‌ను అత్యున్నత దౌత్య పదవిలో నియమించడాన్ని నేతలు తప్పుపడుతున్నారు. ఇక సెక్స్ కుంభకోణంలో మాండెల్సన్ పేరు బయటకు రావడంతో గతేడాది సెప్టెంబరులో ఆయన్ని పదవి నుంచి తప్పించారు. అయినప్పటికీ ప్రధాని కీర్ స్టార్మర్‌పై విమర్శలు ఆగలేదు. ఫలితంగా ఆయన పదవికే ముప్పు ఏర్పడింది.
ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాజీనామా..
మరోవైపు మాండెల్సన్ నియామకంలో పూర్తి బాధ్యత నాదే అని చెప్పి ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్, కీర్ స్టార్మర్‌కు అత్యంత సన్నిహితుడు మోర్గాన్ మెక్ స్వీనీ రాజీనా చేశారు. అయినా సంక్షోభం ఆగలేదు సరికదా, మరింత ముదిరింది. కీర్ స్టార్మర్‌పై రాజీనామా చేయాలనే ఒత్తిడి రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయన తన పదవి కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎంపీల మద్దతు కోరుతున్నారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో ఎంపీలతో కీర్ స్టార్మర్ రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు టాక్.
ప్రధాని రేసులో..
తాజా వివాదం నేపథ్యంలో కీర్ స్టార్మర్ ప్రధాని పదవిలో కొనసాగే అవకాశం చాలా తక్కువ ఉంది. బాధ్యతలు చేపట్టిన ఏడాదికే ఆయన పదవి నుంచి దిగిపోయే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టే నేత ఎవరన్నది ప్రస్తుతం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పలువురి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. మాజీ డిప్యూటీ పీఎం, పార్టీలో బలమైన కేడర్ గల నేత ఏంజెలా రేనర్, హెల్త్ సెక్రటరీ వెస్ స్ట్రీటింగ్, లేబర్ పార్టీ మాజీ నేత, ఎనర్జీ సెక్రటరీ ఎడ్ మిలిబాండ్, హోమ్ సెక్రటరీ షబానా మహమూద్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, హోమ్ సెక్రటరీ షబానా మహమూదే (Shabana Mahmood) ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మొట్ట మొదటి ముస్లిం ప్రధానిగా..
షబానా ఈ బాధ్యతలు చేపడితే.. బ్రిటన్‌కు మొట్టమొదటి ముస్లిం ప్రధానిగా రికార్డు క్రియేట్ చేయనున్నారు. అంతేకాదు, పాకిస్థాన్ సంతతికి చెందిన మొదటి ప్రధాన మంత్రిగా కూడా చరిత్ర సృష్టించనున్నారు. ఆమె తల్లిదండ్రులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్‌పూర్ ప్రాంతానికి చెందినవారు. షబానా మహమూద్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. కొన్ని రోజులు లాయర్‌గానూ పనిచేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. 2010 నుంచి బర్మింగ్‌హామ్ లేడీవుడ్ ఎంపీగా ఉన్నారు. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళల్లో ఈమె ఒకరు. 2025 సెప్టెంబర్‌లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను హోమ్ సెక్రటరీగా నియమించారు. ఈ పదవి చేపట్టిన తొలి ముస్లిం మహిళకూడా షబానానే కావడం విశేషం. లేబర్ పార్టీలో ఆమెకు అత్యంత సమర్థురాలైన రాజకీయ నేతగా పేరుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Melania Trump | అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
ఏప్రిల్ 10, 2026

UK | ఇరాన్‌పై దాడులకు మా సైనిక స్థావరాలు వినియోగించుకోచ్చు.. యూఎస్‌తో చేతులు కలిపిన యూకే
మార్చి 21, 2026

Epstein Files | మనుషుల జ్ఞాపకాలను ఎప్‌స్టీన్ చెరిపివేశాడా..? MIT ప్రముఖుడితో సంభాషణ..
ఫిబ్రవరి 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



