Donald Trump | చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. అలా చేస్తే తీవ్ర పరిణామాలు..
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేయబోతుందన్న వార్తలపై ఆయన స్పందించారు. చైనా నిజంగానే ఆ పనిచేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
International | Published On Apr 12, 2026, 11.45 am IST
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేయబోతుందన్న వార్తలపై ఆయన స్పందించారు. చైనా నిజంగానే ఆ పనిచేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చైనా వచ్చే కొన్ని వారాల్లో ఇరాన్‌కు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, MANPADS (మ్యాన్‌ప్యాడ్స్) అనే అత్యాధునిక ఆయుధాలను ఇతర దేశాల ద్వారా సరఫరా చేయనుందని, దీని వల్ల ఆయుధ మూలాలు తెలియకుండా ఉండాలనేదే చైనా ఉద్దేశమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ట్రంప్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ట్రంప్ చైనాకు హెచ్చరికలు చేశారు. శ్వేత సౌధంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తో కలిసి ట్రంప్ మాట్లాడారు. ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తే చైనాకు పెద్ద సమస్య ఎదురవుతుందని అన్నారు.
అమెరికా ఆరోపణలు అవాస్తవం: చైనా రాయబారి
అయితే ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి వైట్ హౌస్ వర్గాలు పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఇక ఈ వ్యాఖ్యలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి స్పందించారు. ట్రంప్ ఆరోపణలను ఖండించారు. చైనా ఎప్పుడూ ఏ ఘర్షణలోనూ ఏ దేశానికీ ఆయుధాలను సరఫరా చేయలేదని స్పష్టం చేశారు. ట్రంప్‌కు అందిన సమాచారం అసత్యమని, అమెరికా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుందని అన్నారు. అమెరికా అత్యుత్సాహ ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుందని, అలాంటిది ఆయుధాలను ఎందుకు సరఫరా చేస్తామని ప్రశ్నించారు.
అమెరికా సైనిక విమానాలకు ప్రమాదకరం: సీఎన్ఎన్
ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ నివేదికలను దృష్టిలో ఉంచుకుని, అమెరికా గూఢచారి వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ట్రంప్ ఆ వ్యాఖ్యలను చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఇరాన్‌కు చైనా సహకారం అందిస్తుందని ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ట్రంప్ తాజా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా గూఢచారి వర్గాలు తెలిపిన ప్రకారం చైనా ఇరాన్‌కు కొత్త ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అందించేందుకు సిద్ధమవుతోందని, ఈ ప్రక్రియ కొన్ని వారాల్లో జరగనుందని సీఎన్ఎన్ తన నివేదికలో పేర్కొంది. భుజంపై మోసుకుని తీసుకెళ్లే అత్యాధునిక యాంటీ-ఎయిర్ మిసైల్ వ్యవస్థలైన MANPADSను కూడా ఇరాన్‌కు చైనా అందివ్వబోతుందని సీఎన్ఎన్ తెలియజేసింది. ఈ ఆయుధాలు అమెరికా సైనిక విమానాలకు ప్రమాదకరమని పేర్కొంది. అయితే ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న వివరాలు అమెరికాకు తెలియకుండా ఉండేందుకు చైనా వాటిని ఇతర దేశాల ద్వారా సరఫరా చేయనుందని తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






