2026 World Economic Forum | మధ్యస్థ దేశాలు ఐక్యంగా ఉండాల్సిందే.. లేదంటే అగ్రరాజ్యాలకు బలికాక తప్పదు: దావోస్ సదస్సులో కెనడా పీఎం
2025 మార్చిలో జస్టిన్ ట్రూడో తర్వాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ.. అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న పోటీ మధ్య కెనడా విదేశీ విధానాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఈ వ్యాఖ్యలు చేశారు.
International | Published On Jan 21, 2026, 3.44 pm IST
సంక్షిప్త సారాంశం
"ప్రపంచం ఇప్పుడు కేవలం మార్పు దశలో లేదు, విచ్ఛిన్నం చెందే దశలో ఉంది. పాత నియమాలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ క్రమంగా కనుమరుగవుతోంది. ఇలాంటి సమయంలో కెనడా వంటి మధ్యస్థ దేశాలు (Middle Powers) తమ వ్యూహాలను మార్చుకోవాలి. ప్రపంచ నిర్ణయాధికార పట్టిక వద్ద మనం కూర్చోవాలి, లేదంటే ఇతరుల ప్రయోజనాల కోసం మనం బలికాక తప్పదు. గుర్తుంచుకోండి... మనం టేబుల్ వద్ద లేకపోతే, మెనూలో ఉంటాం." అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు.
2026 World Economic Forum | స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచ రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. సూపర్ పవర్స్, మిడిల్ పవర్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో మధ్యస్థ దేశాల (Middle Powers) ప్రాముఖ్యతపై ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
టేబుల్ వద్ద లేకపోతే మెనూలో ఉంటాం
ప్రపంచ వేదికపై నిర్ణయాలు తీసుకునే చర్చల్లో టేబుల్ వద్ద లేకుండా మధ్యస్థ దేశాలు క్రియాశీలక పాత్ర పోషించకపోతే.. అవి మెనూలో ఉండాల్సి వస్తుందన్నారు. అంటే బహుళజాతి శక్తుల ప్రయోజనాల కోసం బలి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
శక్తివంతమైన దేశాలు తమ ప్రయోజనాల కోసం వాణిజ్యాన్నే ఆయుధంగా మార్చుకొని అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కుతున్నాయని మండిపడ్డారు.
మధ్యస్థ దేశాల ఐక్యత
కెనడా లాంటి దేశాలు ఒంటరి కాకుండా ఉండాలంటే, సమాన ఆలోచనలు కలిగిన ఇతర దేశాలతో కలిసి బలమైన కూటమిగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. రక్షణ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంధన వనరులు లాంటి విషయాల్లో స్వయం సమృద్ధి సాధిస్తేనే పెద్ద దేశాల ఒత్తిడిని తట్టుకోగలమన్నారు.
నాటో రక్షణ బడ్జెట్లో మార్పులు
2025 మార్చిలో జస్టిన్ ట్రూడో తర్వాత కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మార్క్ కార్నీ.. అమెరికా, చైనాల మధ్య పెరుగుతున్న పోటీ మధ్య కెనడా విదేశీ విధానాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గ్రీన్లాండ్ సార్వభౌమాధికారం, నాటో (NATO) రక్షణ బడ్జెట్ మార్పుల అంశాలపై కెనడా తన స్వరాన్ని బలంగా వినిపిస్తోంది.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






