Apple MacBook Pro | యాపిల్ నుంచి కొత్త టచ్ స్క్రీన్ మ్యాక్‌బుక్ ప్రొ.. ఫీచర్లు మామూలుగా లేవు..
Apple MacBook Pro | యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లను ఎం5 ప్రొ, ఎం5 మ్యాక్స్ చిప్‌సెట్లతో ప్రకటించింది. టాండమ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్, డైనమిక్ ఐలాండ్, 128 జీబీ వరకు యూనిఫైడ్ మెమరీ, 16 టీబీ వరకు స్టోరేజ్ వంటి కీలక ఫీచర్లను అందిస్తోంది. 14, 16 ఇంచుల వేరియంట్లలో లభించే ఈ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.3,49,900గా ఉంది.
Technology | Published On Oct 29, 2026, 3.44 pm IST
Apple MacBook Pro | యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లను ఎం5 ప్రొ, ఎం5 మ్యాక్స్ చిప్‌సెట్లతో ప్రకటించింది. టాండమ్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్, డైనమిక్ ఐలాండ్, 128 జీబీ వరకు యూనిఫైడ్ మెమరీ, 16 టీబీ వరకు స్టోరేజ్ వంటి కీలక ఫీచర్లను అందిస్తోంది. 14, 16 ఇంచుల వేరియంట్లలో లభించే ఈ ల్యాప్‌టాప్‌ల ప్రారంభ ధర రూ.3,49,900గా ఉంది.
అదిరిపోయే డిస్‌ప్లేలు, డైనమిక్ ఐలాండ్..
ల్యాప్‌టాప్‌ల మార్కెట్‌లో యాపిల్ మరో కీలక మార్పునకు శ్రీకారం చుట్టింది. కొత్త తరం మ్యాక్‌బుక్ ప్రొ మోడళ్లలో తొలిసారిగా ఇంటర్నల్ టచ్‌స్క్రీన్‌ను ప్రవేశపెట్టింది. టాండమ్ ఓఎల్‌ఈడీ సాంకేతికతతో రూపొందించిన ప్రొలెడ్ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేతో పాటు, ఐఫోన్లలో కనిపించే డైనమిక్ ఐలాండ్‌ను కూడా మ్యాక్‌బుక్‌లోకి తీసుకొచ్చింది. ఎం5 ప్రొ, ఎం5 మ్యాక్స్ ప్రాసెసర్లతో రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్, త్రీడీ డిజైన్, కృత్రిమ మేధ ఆధారిత పనులకు ఉపయోగపడేలా రూపుదిద్దుకున్నాయి. కొత్త ప్రొలెడ్ ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేలో రెండు స్వయం ప్రకాశించే పిక్సల్ పొరలతో కూడిన టాండమ్ ఓఎల్‌ఈడీ ప్యానెల్‌ను ఉపయోగించారు. ఇది గరిష్ఠంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్, 1,00,00,000:1 కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. పీ3 కలర్ గామట్‌తోపాటు అడోబ్ ఆర్జీబీ కలర్ స్పేస్‌కు మద్దతు, రెక్.2020 ప్రమాణంలో 80 శాతానికి పైగా కలర్ కవరేజ్ ఉన్నాయి.
తక్కువ బరువు, ఎక్కువ ఫీచర్లు..
ప్రొమోషన్ సాంకేతికతతో 10 నుంచి 120 హెడ్జ్ వరకు రిఫ్రెష్ రేట్ మారుతుంది. కాంతి ప్రతిబింబాలను తగ్గించేందుకు అదనంగా రూ.18వేలు చెల్లించి నానో-టెక్స్చర్ గ్లాస్‌ను ఎంచుకోవచ్చు. టచ్‌స్క్రీన్‌పై పాన్ చేయడం, పించ్-టు-జూమ్, విండోలను అమర్చడం, నేరుగా డిజైన్ కాన్వాస్‌పై పనిచేయడం వంటి సౌకర్యాలున్నాయి. ఇప్పటికే ఉన్న మ్యాక్ఓఎస్ సాఫ్ట్‌వేర్‌లో టచ్ ఇన్‌పుట్‌ను మౌస్ క్లిక్‌లుగా ఆటోమేటిక్‌గా గుర్తించేలా వ్యవస్థ రూపొందించగా, డెవలపర్లు ప్రత్యేక జెశ్చర్ ఏపీఐలతో తమ అప్లికేషన్లకు టచ్ ఫీచర్లను జోడించవచ్చు. డిస్‌ప్లే రిఫరెన్స్ మోడ్‌లు, జెన్‌లాక్ సింక్రనైజేషన్, వైద్య రంగంలో ద్వితీయ సమీక్ష కోసం డీఐసీఓఎం గ్రేస్కేల్ వ్యూయింగ్ సదుపాయాలనూ అందించారు. 14 ఇంచుల మోడల్ 14.2 ఇంచుల డిస్‌ప్లేతో, 16 ఇంచుల మోడల్ 16.2 ఇంచుల డిస్‌ప్లేతో వస్తాయి. కొత్త మోడళ్లు మునుపటి వాటితో పోలిస్తే తక్కువ బరువు, సన్నని అంచులతో నిర్మాణమయ్యాయి. 14 ఇంచుల మోడల్ బరువు ఎం5 ప్రొతో 1.38 కిలోలు, ఎం5 మ్యాక్స్‌తో 1.4 కిలోలు కాగా, 16 ఇంచుల మోడల్ బరువు వరుసగా 1.82 కిలోలు, 1.84 కిలోలుగా ఉన్నాయి.

శక్తివంతమైన సీపీయూ, గ్రాఫిక్స్..
ఐఫోన్ నుంచి తీసుకొచ్చిన డైనమిక్ ఐలాండ్‌లో 12 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ కెమెరాను అమర్చారు. స్పాట్‌లైట్ సెర్చ్‌లు, కాల్స్, మీడియా కంట్రోల్స్, లైవ్ యాక్టివిటీస్‌ను ఇక్కడి నుంచే నిర్వహించవచ్చు. నిరంతర పనిభారంలో పనితీరు మెరుగ్గా ఉండేందుకు గాలి ప్రసరణ వ్యవస్థనూ అప్‌డేట్ చేశారు. ఎం5 ప్రొ చిప్‌లో 15-కోర్ సీపీయూ, 16-కోర్ జీపీయూ లేదా 18-కోర్ సీపీయూ, 20-కోర్ జీపీయూ కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. ఎం5 మ్యాక్స్‌లో 18-కోర్ సీపీయూతోపాటు 32-కోర్ లేదా 40-కోర్ జీపీయూ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. రెండు చిప్‌లలోనూ 16-కోర్ న్యూరల్ ఇంజిన్, హార్డ్‌వేర్ ఆధారిత రే ట్రేసింగ్ ఉన్నాయి. 24, 36, 48 జీబీ యూనిఫైడ్ మెమరీ ఎంపికలతోపాటు, నిర్దిష్ట కాన్ఫిగరేషన్లలో 128 జీబీ వరకు మెమరీ, 1 టీబీ, 2 టీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌తో పాటు 4, 8, 16 టీబీ వరకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. భారీ భాషా నమూనాలు, జనరేటివ్ ఏఐ పనులను పరికరంలోనే నిర్వహించేందుకు ఈ చిప్‌లు తోడ్పడతాయి.
కనెక్టివిటీ కోసం మూడు థండర్‌బోల్ట్ 5 యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, హెచ్‌డీఎంఐ 2.1, ఎస్‌డీఎక్స్‌సీ కార్డ్ స్లాట్, మ్యాగ్‌సేఫ్ 3, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. యాపిల్ ఎన్1 చిప్‌తో వైఫై 7, బ్లూటూత్ 6 కనెక్టివిటీ లభిస్తుంది. ఎం5 ప్రొతో మూడు, ఎం5 మ్యాక్స్‌తో నాలుగు బాహ్య డిస్‌ప్లేలను అనుసంధానించవచ్చు. 14 ఇంచుల మోడల్‌లో 72.6 వాట్-అవర్ బ్యాటరీ, 16 ఇంచుల మోడల్‌లో 100 వాట్-అవర్ బ్యాటరీ ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌తో 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ సాధ్యమవుతుంది.
ధర వివరాలు..
భారత్‌లో 14 ఇంచుల ఎం5 ప్రొ బేస్ మోడల్ ధర రూ.3,49,900 ఉండగా, 14 ఇంచుల ఎం5 మ్యాక్స్ ధర రూ.5,49,900గా ఉంది. 16 ఇంచుల ఎం5 ప్రొ మోడల్ ధర రూ.4,09,900 నుంచి ప్రారంభమవుతుంది. 16 ఇంచుల ఎం5 మ్యాక్స్ వేరియంట్ ధర రూ.5,89,900గా ఉంది. అన్ని మోడళ్లలోనూ మ్యాక్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎం5 ప్రొ 16-కోర్ జీపీయూ వేరియంట్‌తో 70 వాట్ యూఎస్‌బీ సి పవర్ అడాప్టర్, 20 కోర్ జీపీయూ వేరియంట్‌తో 96 వాట్ అడాప్టర్ అందిస్తారు. 16 ఇంచుల మోడళ్లకు 140 వాట్ అడాప్టర్ ఇస్తారు. గురువారం నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, నవంబర్ 6 నుంచి సాధారణ విక్రయాలు మొదలుకానున్నాయి.
తాజావార్తలు
- ●Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్
- ●Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!
- ●South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..
- ●Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు
- ●Kotta Prabhakar Reddy | లాస్య మృతిలో వాస్తవాలు తేల్చాలి.. 20 లక్షల పరిహారం ఇవ్వాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్
- ●Janhvi Kapoor | ఆ అవమానం జీవితాంతం మోయాల్సిందే - పెద్ద వివాదంపై జాన్వీకపూర్ రియాక్షన్

Abhishek Banerjee | అలా అయితే.. టీఎంసీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించండి : అభిషేక్ బెనర్జీ డిమాండ్

Graduate MLC Elections | పట్టభద్రుల MLC పోరు: కాంగ్రెస్ మార్క్ వ్యూహం.. ఏకంగా 233 మంది ఇన్ఛార్జుల రంగప్రవేశం!

South Central Railway | ఇక పెన్షనర్లకు.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఇంట్లో నుంచే సులభంగా..

Jairam Ramesh | వారణాసి నుంచి నాగ్‌పూర్ వరకూ.. మోదీ ప్రభుత్వ విధానాలను ప్రజలు తిరస్కరించారు




