Inter Student | ఇంటర్ పరీక్షకు వెళ్లి.. మృత శిశువుకు జన్మనిచ్చిన విద్యార్థిని
Inter Student | ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని.. పరీక్షా కేంద్రంలోని బాత్రూమ్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శుక్రవారం వెలుగు చూసింది.
Inter Student | త్రినేత్ర.న్యూస్ : ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని.. పరీక్షా కేంద్రంలోని బాత్రూమ్‌లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో శుక్రవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచలోని ఓ పరీక్షా కేంద్రానికి ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు 16 ఏళ్ల విద్యార్థిని వచ్చింది. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. 30 నిమిషాల తర్వాత ఇన్విజిలేటర్ అనుమతతిలో సదరు బాలిక బాత్రూమ్‌కు వెళ్లింది. విద్యార్థిని ఎంతసేపటికి రాకపోవడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి.. బాత్రూమ్ వైపు వెళ్లి చూడగా షాక్‌కు గురైంది.
విద్యార్థిని మెల్లిగా నడుచుకుంటూ బయటకు వచ్చింది. రక్తపు మరకలు కూడా గ్రహించింది. దీంతో బాలికను నిలదీయగా అసలు విషయం వెలుగు చూసింది. గర్భంతో ఉండడంతో నొప్పులు భరించలేక మరుగుదొడ్డికి వెళ్లి మృతశిశువుకు జన్మనిచ్చినట్లు తెలిపింది.
సిబ్బంది వెళ్లిచూడగా.. బేసిన్‌లో మృతశిశువు ఆచూకీ దొరికింది. పరువు పోతుందనే భయంతోనే ఎవరికీ అనుమానం రాకుండా శిశువును బాత్‌రూం బేసిన్‌లో కుక్కినట్లు తెలిసింది. పరీక్ష కేంద్రం నిర్వాహకులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులకు చేరవేశారు. బాలికను పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మృతశిశువును 108 వాహనంలో మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఎవరూ ఫిర్యాదు చేయని పక్షంలో బాలిక విద్యనభ్యసిస్తున్న కళాశాల యాజమాన్యం ద్వారా ఫిర్యాదు స్వీకరిస్తామన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



