త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

America | ఇరాన్‌పై చ‌ర్య‌ల‌కు పూనుకున్న అమెరికా.. ముందుగా సుంకాల‌తో మొద‌లు..

America | ఇరాన్‌లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తు రోడ్ల‌పైకి వ‌చ్చి ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. అక్క‌డి సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ చ‌ర్య‌ల‌కు నిర‌స‌గా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఈక్ర‌మంలోనే చాలా మంది ఇప్ప‌టికే ప్రాణాల‌ను కోల్పోయారు. మ‌రోవైపు రాజ‌ధాని టెహ్రాన్ స‌హా అనేక చోట్ల ఆందోళ‌న‌లు ఉధృతం అవుతున్నాయి.

S

International | Published On Jan 13, 2026, 7.11 am IST

America | ఇరాన్‌పై చ‌ర్య‌ల‌కు పూనుకున్న అమెరికా.. ముందుగా సుంకాల‌తో మొద‌లు..
Advertisement

America | ఇరాన్‌లో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తు రోడ్ల‌పైకి వ‌చ్చి ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. అక్క‌డి సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ చ‌ర్య‌ల‌కు నిర‌స‌గా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఈక్ర‌మంలోనే చాలా మంది ఇప్ప‌టికే ప్రాణాల‌ను కోల్పోయారు. మ‌రోవైపు రాజ‌ధాని టెహ్రాన్ స‌హా అనేక చోట్ల ఆందోళ‌న‌లు ఉధృతం అవుతున్నాయి. అయితే ప్ర‌జా ఉద్య‌మాన్ని అణచివేసేందుకు ఖ‌మేనీ ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇరాన్ పౌరుల‌పై అనేక ఆంక్ష‌ల‌ను విధించారు. ప్ర‌భుత్వానికి చెందిన మీడియా చాన‌ల్స్‌, ఇంట‌ర్నెట్ త‌ప్ప ఇత‌రుల‌ను అనుమ‌తించ‌డం లేదు. అనేక చోట్ల ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపివేవేశారు. కాగా ఇరాన్‌లో జ‌రుగుతున్న ఈ ఆందోళ‌న‌ల్లో ఇప్ప‌టికే సుమారుగా 500 మందికి పైగా మృతి చెందినట్లు తెలిసింది.

అయితే ఆందోళ‌న‌కారుల‌ను అణ‌చివేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే ఇరాన్‌పై తీవ్ర చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌తామ‌ని ఇప్ప‌టికే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే మృతుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌డంతో ఆమెరికా రంగంలోకి దిగింది. ఇరాన్ చ‌ర్య‌ల‌కు ప్ర‌తిచ‌ర్య‌లు చేసేందుకు పూనుకుంది. ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న దేశాల‌పై 25 శాతం సుంకాల‌ను విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే ఇరాన్‌పై అమెరికా సైనిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుండ‌గా ట్రంప్ మాత్రం ఇలా టారిఫ్ ల‌ను పెంచ‌డం గ‌మ‌నార్హం. పెంచిన ఈ సుంకాలు త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తాయ‌ని అమెరికా తెలియ‌జేసింది.

ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశం అయినా స‌రే త‌మ‌కు 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంద‌ని ట్రంప్ అన్నారు. ఈ మేర‌కు ట్రంప్ త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌లో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. కాగా ఇరాన్‌కు చైనా, ట‌ర్కీ, యూఏఈ, ఇరాక్‌లు ప్ర‌ధాన వాణిజ్య భాగ‌స్వాములుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ట్రంప్ విధించిన టారిఫ్‌లు ఆ దేశాల‌పై ప‌డ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement