Jana Nayagan | సుప్రీంకోర్టుకు జన నాయగన్.. ఈ నెల 19న విచారించే ఛాన్స్..!
Jana Nayagan | తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రిలీజ్ వాయిదాపడింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Entertainment | Published On Jan 13, 2026, 9.14 pm IST
Jana Nayagan | తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం జన నాయగన్. మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో రిలీజ్ వాయిదాపడింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేవీఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్మాణ సంస్థ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 19న సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నది.
హీరో విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం జన నాయగన్. ఈ మూవీని జనవరి 8న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. అయితే, సెన్సార్ సర్టిఫికెట్ పెండింగ్‌లో ఉండడంతో చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ ఉత్తర్వుపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వును సవాల్ చేశారు.
జన నాయగన్ చిత్రంలో ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, సెన్సార్ బోర్డు చాలా సీన్స్‌కు అభ్యంతరం చెప్పినట్లుగా తెలుస్తున్నది. దాంతో సర్టిఫికెట్‌ను జారీ చేసేందుకు సెన్సార్ బోర్డు నిరాకరిస్తున్నట్లు సమాచారం. అయితే, చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ లభించకపోవడంతో నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ జనవరి 6న మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో మూవీ రిలీజ్ కాకపోతే రూ.500 కోట్ల నష్టం జరుగుతుందని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ విజయ్‌ని సోమవారం ఆరుగంటల పాటు విచారించింది. 19న మళ్లీ విచారించనున్నది. తొక్కిసలాట కేసులో తమిళనాడు మాజీ ఏడీజీ ఎస్‌ని సీబీఐ విచారించింది. ఈ కేసులో పలువురు టీవీకే పార్టీ అధికారులు, విజయ్ డ్రైవర్, కొంతమంది పోలీసు అధికారులను విచారించింది సీబీఐ.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






