Iran Unrest | ఇరాన్‌లో ముదురుతున్న సంక్షోభం.. నిరసనల్లో 2వేలమందికిపైగా మృతి..!
Iran Unrest | ఇరాన్‌లో సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. రెండువారాలుగా పలు నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఈ నిరసనలు హింసకు దారి తీస్తున్నాయి. నిరసనల్లో ఇప్పటి వరకు దాదాపు 2వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Jan 13, 2026, 6.39 pm IST
Iran Unrest | ఇరాన్‌లో సంక్షోభం మరింత తీవ్రమవుతున్నది. రెండువారాలుగా పలు నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పలుచోట్ల ఈ నిరసనలు హింసకు దారి తీస్తున్నాయి. నిరసనల్లో ఇప్పటి వరకు దాదాపు 2వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నిరసన కారులతో పాటు భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఇరాన్ అధికారులు మరణాల సంఖ్యను అంగీకరించడం ఇదే తొలిసారి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ నిరసనలు, మరణాలకు కారణం ఉగ్రవాదులేనని అధికారులు ఆరోపించారు. ఆయా ఘటనల్లో చనిపోయిన వారిలో నిరసనకారులు ఎందరు? భద్రతా సిబ్బంది ఎంత మంది ? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అయితే, ఇబ్బందికరంగా మారిన ఆర్థిక పరిస్థితుల కారణంగా తాజాగా ఇరాన్‌లో అశాంతి నెలకొన్నది. గత మూడేళ్లలో ఇరాన్‌కు ఇదే అతిపెద్ద సవాల్‌గా భావిస్తున్నారు. గతేడాది ఇజ్రాయెల్, యూఎస్ ఇరాన్‌పై దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత ఇరాన్ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. దానికి ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ భారీగా పడిపోయింది. ఈ క్రమంలో దేశంలో తీవ్ర ఇబ్బందులుపడుతున్న జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అయితే, 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాల్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, నిరసన విషయంలో ప్రభుత్వం ద్వంద విధానాలను అవలంభిస్తుందనే విమర్శలు ఉన్నాయి.
ఓ వైపు ఆర్థిక సమస్యలపై నిరసనలను సమర్థిస్తూనే మరో వైపు వాటిపై కఠిన చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఈ అశాంతిని రెచ్చగొట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. తాము ఉగ్రవాదులు భావించేవారే ఈ నిరసనలను నియంత్రిస్తున్నారని ఇరాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా.. నిరసనలు, హింసాత్మక ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్యను మానవ హక్కలు సంస్థలు ధ్రువీకరించాయి. వేలాది మందిని అరెస్టు చేసినట్లుగా పేర్కొన్నాయి. దాదాపుగా 10వేల మందికిపైగా నిరసన కారులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. నిరసనకారులపై తూటాల వర్షం, మంటల్లో కాలిపోతున్న భవనాలు, వాహనాలు కనిపించాయి. అయితే, సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






