Khamenei | అమెరికాకు ఖమేనీ హెచ్చరిక.. తాము అందుకు సిద్ధమే అని ప్రకటన..
Khamenei | ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు తెలిపిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అమెరికాకు ఆయన హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు పెట్టారు.
International | Published On Jan 13, 2026, 11.27 am IST
Khamenei | ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాలను విధిస్తున్నట్లు తెలిపిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అమెరికాకు ఆయన హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇరాన్ దేశం శత్రువుల ముందు తలొగ్గదు. అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలను ఆపాలి. కిరాయి వ్యక్తులపై ఆధారపడడం మానేయాలి. ఇరాన్ బలమైన, శక్తివంతమైన దేశం. శత్రువుల గురించి మాకు తెలుసు. వారిని ఎదుర్కోవడానికి మేం ఎల్లప్పుడూ సిద్ధమే.. అని ఖమేనీ ఆ పోస్టులో తెలిపారు.
కాగా ఇరాన్‌లో ఆందోళనలు ఉధృతమవడం, ఇప్పటి వరకు 500 మందికి పైగా పౌరులు మృతి చెందడంతో ఆ దేశంపై చర్యలకు పూనుకుంటున్నట్లు అమెరికా చెప్పకనే చెప్పింది. అందులో భాగంగా ముందుగా 25 శాతం సుంకాల పెంపును తెరపైకి తెచ్చారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో ఎక్కువగా చైనా, టర్కీ, యూఏఐ, ఇరాక్, భారత్ వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. దీంతో ఆయా దేశాలపై ట్రంప్ సుంకాల ప్రభావం పడింది. అయితే ఇరాన్‌పై అమెరికా చేపట్టనున్న చర్యల్లో భాగంగా ఆ దేశంపై అమెరికా ముందుగా వైమానిక దాడులు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగానే ముందుగా 25 శాతం సుంకాలను విధించారని సమాచారం. ఈ నేపథ్యంలో ఖమేనీ కూడా అమెరికాను హెచ్చరిస్తూ పోస్టులు పెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా దాడి చేస్తుందన్న వార్తల కారణంగానే ఖమేనీ ఈ హెచ్చరికలు చేశారని తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






