Nepal | మూడు రోజులుగా వరద బురదలోనే.. అయినా బతికింది..
Nepal | నేపాల్‌లో వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది గల్లంతయ్యారు. అయితే ఓ ఆరేళ్ల బాలిక మాత్రం.. మూడు రోజుల పాటు శిథిలాల కింద బురదలోనే కూరుకుపోయింది. అయినా చివరికి ప్రాణాలతో బయటపడింది.
International | Published On Aug 30, 2026, 9.29 pm IST
Nepal | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.. వేలాది మంది గల్లంతయ్యారు. అయితే ఓ ఆరేళ్ల బాలిక మాత్రం.. మూడు రోజుల పాటు శిథిలాల కింద బురదలోనే కూరుకుపోయింది. అయినా చివరికి ప్రాణాలతో బయటపడింది.
రసువా జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భోటే కోశి రివర్ ఉప్పొంగడంతో.. తిమురే గ్రామంలోఓ వరద పోటెత్తింది. దీంతో స్థానికంగా ఇండ్లు నేలమట్టం అయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అక్కడ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్స్ తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. అయితే శిథిలాల కింద నుంచి ఓ చిన్నారి ఏడుపు వారికి వినిపించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. శిథిలాలను తొలగించి, బురదలో కూరుకుపోయిన ఆరేళ్ల పాపను ప్రాణాలతో కాపాడారు.
తిమురేలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖాట్మండ్ తరలించి మెరుగైన చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు, బంధువుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బంధువుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026

Sonu Sood | నేపాల్ త్రిశూలి బజార్‌ను సందర్శించిన సోనూ సూద్
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు
- ●Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Stock Markets | స్వల్పంగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..

ACB Raids | ఏసీబీకి పట్టుబడ్డ సచివాలయం ఉద్యోగులు

Samantha | సినిమాలు మానేయాలనుకున్నా - విడాకుల తర్వాత జీవితంపై సమంత కామెంట్స్

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన



