త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gosula Srinivas Yadav | ఉద్య‌మ‌కారుల‌ను బెదిరిస్తే త‌గిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాద‌వ్

Gosula Srinivas Yadav | అధికారం, మదం, డబ్బు, అహంకారం, భూదాహంతో సర్కారులో షాడో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.. నికార్సైన ఉద్యమ బిడ్డ హరీష్ రావు గురించి ఏమి తెలుసు..? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

S

Telangana | Published On Aug 30, 2026, 8.50 pm IST

Gosula Srinivas Yadav | ఉద్య‌మ‌కారుల‌ను బెదిరిస్తే త‌గిన బుద్ధి చెబుతాం : గోసుల శ్రీనివాస్ యాద‌వ్
Advertisement

Gosula Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్ : అధికారం, మదం, డబ్బు, అహంకారం, భూదాహంతో సర్కారులో షాడో ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.. నికార్సైన ఉద్యమ బిడ్డ హరీష్ రావు గురించి ఏమి తెలుసు..? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల‌ను గుప్పిట్లో పెట్టుకుని వారిని బెదిరించినట్టు ఉద్యమకారుల‌ను బెదిరిస్తే త‌గిన బుద్ధి చెబుతామ‌ని హెచ్చ‌రించారు.

నీ అవినీతి, కుటిల మనస్సును గమనించే ఆనాడు కేసీఆర్‌పై ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా నీకు అవకాశం ఇవ్వలేదు. 2023 తర్వాత రాఘవ సంస్థ, బినామీ సంస్థలు ఎన్ని ఉన్నాయి? బడా కార్పొరేట్ కంపెనీలకు తెలంగాణ భూములను అప్పన్నంగా రాసిస్తూ తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న నీ భాగోతం వివరాలు వివరాలు బయట పెట్టబోతున్నాం. గ‌తంలో పొంగులేటి కంపెనీల భూములు ఎన్ని? ఇప్పుడు ఎన్ని? రెవెన్యూ అధికారులను ఇంట్లో ఉంచుకొని రాత్రికి రాత్రి ఎన్ని భూముల‌ పేర్లు మార్చావు. 22A పేరుతో ఎన్ని వేల ఎకరాలు దోచుకున్నావో చిట్టా సిద్ధంగా ఉందని శ్రీనివాస్ యాద‌వ్ తెలిపారు.

భూములను కొల్లగొట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. రేసు గుర్రంలా పోటీ పడుతున్నారు. మీ ఇద్దరి భూ చిట్టాల‌ను నీ మంత్రి కొండా సురేఖ కుటుంబమే త్వరలో బయటపెట్టబోతుంది. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనని పొంగులేటి ఈరోజు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌తో పాటు ఉద్యమ నాయకులపై చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నీకు రాళ్లతో బుద్ధి చెబుతుంది. ఖబర్దార్ పొంగులేటి.. ఒక మంత్రిగా వ్యవహరించు.. లేదంటే తెలంగాణ ప్రజా కోర్టులో నీకు శిక్ష తప్పదు అని గోసుల శ్రీనివాస్ యాద‌వ్ హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement