NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి
NEET PG | నీట్ పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు వినోద్ కుమార్ లేఖ రాశారు.
NEET PG | త్రినేత్ర.న్యూస్ : నీట్ పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు వినోద్ కుమార్ లేఖ రాశారు. ఆగస్టు 30న దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష సందర్భంగా తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు, డాక్టర్లు.. ఆలిండియా కోటాపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాల వారీగా అనేక కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి, వైద్య విద్యతో పాటు పీజీ సీట్లను గణనీయంగా పెంచిందని ఆయన తెలిపారు. ఈ సీట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల నిధులు, ప్రభుత్వ వనరులు వినియోగించబడుతున్నందున, వాటిలో అధిక భాగం తెలంగాణ వైద్య విద్యార్థులకు అందుబాటులో ఉండేలా విధానం ఉండాలని కోరారు.
నీట్ యూజీలో 15 శాతం ఆలిండియా కోటా అమల్లో ఉండగా, పీజీలో 50 శాతం కోటా ఉండడం సమతుల్యంగా లేదన్నారు. పీజీలో కూడా 15 శాతానికి తగ్గించాలని కోరారు. అలాగే, ప్రతి రాష్ట్రం నుంచి ఆలిండియా కోటాకు ఎన్ని ప్రభుత్వ పీజీ సీట్లు వెళ్తున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది విద్యార్థులు సీట్లు పొందుతున్నారు అనే అంశాలపై రాష్ట్రాల వారీగా పారదర్శకమైన గణాంకాలను విడుదల చేసి, ప్రస్తుత ఆలిండియా కోటా విధానంపై సమగ్ర సమీక్ష చేయాలని వినోద్ కుమార్ కోరారు.
ఈ డిమాండ్ తెలంగాణకు మాత్రమే పరిమితం కాదని, రాష్ట్రాలు తమ ప్రజా నిధులతో అభివృద్ధి చేస్తున్న వైద్య విద్యా మౌలిక వసతులకు అనుగుణంగా పీజీ సీట్లలో సముచిత వాటా రాష్ట్ర విద్యార్థులకు లభించేలా సమతుల్యమైన సమాఖ్య విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



