CV Anand | డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ..
CV Anand | తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెటర్‌గా మైదానంలో అదరగొట్టారు. 82 బంతుల్లోనే 126 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో చెలరేగిపోయారు.
CV Anand | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ క్రికెటర్‌గా మైదానంలో అదరగొట్టారు. 82 బంతుల్లోనే 126 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఐదు సిక్స్‌లతో చెలరేగిపోయారు. హెచ్‌సీఏ సీ డివిజన్ వన్డే లీగ్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా సికింద్రాబాద్ క్లబ్ తరపున సీవీ ఆనంద్ బ్యాట్ పట్టారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో డీజీపీ సెంచరితో మెరిసిపోయారు.
ఒక బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ సీవీ ఆనంద్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఐదు ఓవర్లు వేసిన ఆయన.. కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చారు. వికెట్ దక్కకపోయినప్పటికీ.. ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు.
మరోవైపు జంషీద్ హోర్ముజ్జీ 77 పరుగులు, సంజీవ్ రెడ్డి 40 పరుగులతో రాణించడంతో సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 39 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జట్టు 21.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ పరిస్థితుల నేపథ్యంలో వీజేడీ పద్ధతి ప్రకారం ఫలితాన్ని నిర్ణయించగా సికింద్రాబాద్ క్లబ్ విజేతగా నిలిచింది.
2023లోనూ సెంచరీతో చెలరేగిన సీవీ ఆనంద్..
2023 నవంబర్ 13న సికింద్రాబాద్ క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సీవీ ఆనంద్ యూత్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 104 పరుగులు చేశారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన సికింద్రాబాద్ క్లబ్ నిర్ణీత 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో యూత్ ఎలెవన్ జట్టు 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా క్లబ్ టీమ్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌లోనూ రాణించిన ఆనంద్ ఒక వికెట్ పడగొట్టారు.
సంబంధిత వార్తలు

Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ
ఆగస్టు 3, 2026

RS Praveen Kumar | సీఎం రేవంత్ మీద కేసు నమోదు చేయాల్సిందే.. BNS Section 45 మళ్లీ మళ్లీ చదవండి
జులై 14, 2026

CV Anand | ఆ అధికారిని సస్పెండ్ చేయండి.. సైబరాబాద్ సీపీకి డీజీపీ ఆదేశం..
జులై 13, 2026
తాజావార్తలు
- ●NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి
- ●Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్‌లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!
- ●Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న - ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్
- ●Polity Prabhakar Reddy | సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థుల ఫేవరెట్ 'పాలిటీ' ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంట్: 30 ఏళ్ల ప్రస్థానంలో చెరగని ముద్ర
- ●Srinivas Goud | బీసీల గొంతు కొద్దాం అనుకుంటున్నారా..?
- ●Teenmar Mallanna | సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేస్తా.. రెడ్లు, వెలమల దోపిడీ లెక్కలు ఇంటింటికీ వివరిస్తా

NEET PG | నీట్-పీజీ ఆల్ ఇండియా కోటాను 50 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలి

Telangana SIR Portal | తెలంగాణ ఓటర్లకు బిగ్ రిలీఫ్: SIR పోర్టల్‌లో కొత్త అప్డేట్.. ఆ 11 డాక్యుమెంట్లు అప్లోడ్ చేసుకోవచ్చు!

Rashmika Mandanna | వరలక్ష్మి వ్రతం చేసిన రష్మిక మందన్న - ఇన్‌స్టా పోస్ట్‌తో గుడ్‌న్యూస్

Polity Prabhakar Reddy | సివిల్స్, గ్రూప్స్ అభ్యర్థుల ఫేవరెట్ 'పాలిటీ' ప్రభాకర్ రెడ్డి రిటైర్మెంట్: 30 ఏళ్ల ప్రస్థానంలో చెరగని ముద్ర



