త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nigeria military aircraft | కుప్ప‌కూలిన మిలిట‌రీ విమానం.. 32 మంది మృతి

Nigeria military aircraft | నైజీరియాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా స‌మీపంలో మిలిట‌రీ విమానం కుప్ప‌కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 25 మంది ప్ర‌యాణికులు, ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

S

International | Published On Oct 6, 2026, 8.13 am IST

Nigeria military aircraft | కుప్ప‌కూలిన మిలిట‌రీ విమానం.. 32 మంది మృతి
Advertisement

Nigeria military aircraft | త్రినేత్ర న్యూస్ : నైజీరియాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఓండో రాష్ట్రంలోని ఇగ్బోకోడా స‌మీపంలో మిలిట‌రీ విమానం కుప్ప‌కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 25 మంది ప్ర‌యాణికులు, ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. నైజీరియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 'ATR-42 మిలిటరీ విమానం సోమవారం ఒక్కసారిగా కూలిపోయిన‌ట్లు ఆ దేశ అధికార యంత్రాంగం నిర్ధారించింది.

ప్ర‌మాద ఘ‌ట‌న‌పై నైజీరియా విమానయాన శాఖ మంత్రి ఫెస్టస్ కేయామో స్పందించారు. మిలిట‌రీ విమానం నైజీరియా ఆర్థిక రాజ‌ధాని లాగోస్‌కు సాధార‌ణ ర‌వాణా విధి నిర్వ‌హ‌ణ‌లో వెళ్తున్న స‌మ‌యంలో.. ఒండో రాష్ట్రంలోని న‌దీతీర ప‌ట్ట‌ణం.. ఇగ్బోకోడాలో కుప్ప‌కూలిపోయింద‌ని తెలిపారు. న‌ది తీరంలోని చెట్ల‌ను తాకుతూ కూలిపోయింద‌న్నారు. ఈ ప్ర‌మాద ధాటికి మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోయాయ‌ని పేర్కొన్నారు. స‌హాయ‌క బృందాలు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశాయ‌ని తెలిపారు. మృత‌దేహాలు చెల్లాచెదురుగా ప‌డిపోవ‌డంతో.. వాటి ఆచూకీ కోసం న‌దీతీరంలో గాలిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

ప్ర‌త్య‌క్ష సాక్షి మాట్లాడుతూ.. విమానం కుప్ప‌కూలిన స‌మ‌యంలో పిడుగు ప‌డిన‌ట్లు పెద్ద శ‌బ్దం వినిపించింది. చెట్ల‌ను తాకుతూ విమానం కూలిపోయింది. చెట్లు కూడా విరిగిప‌డ్డాయి. ప్ర‌యాణికుల శ‌రీర భాగాలు, బ‌ట్ట‌లు చెల్లాచెదురుగా ప‌డిపోయాయి అని తెలిపాడు.

Advertisement
Advertisement