త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం

ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు నకిలీ ఫారం-7 బల్క్ దరఖాస్తులపై ఈసీ కొరడా! తప్పుడు సమాచారం ఇస్తే కేసులు తప్పవంటూ సీఈవో ఆదేశాలు జారీ చేశారు.

J

Telangana | Published On Oct 5, 2026, 10.01 pm IST

Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం

సంక్షిప్త సారాంశం

తెలంగాణలో ఓటర్ల సమగ్ర సవరణ (SIR-2026) వేళ భారీ సంఖ్యలో బోగస్ ఫారం-7 దరఖాస్తులు దాఖలవుతున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు డిక్లరేషన్లతో ఓట్లు తొలగించే ప్రయత్నం చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 31 కింద చర్యలకు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్ రూల్-20 ప్రకారం క్షేత్రస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఈఆర్వోలకు సీఈవో సి.సుదర్శన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, కలెక్టర్లతో పాటు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకు అధికారిక మెమోను ఈసీఐ కార్యాలయం పంపింది.

Advertisement

Telangana CEO Form 7 Order | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) ప్రక్రియ జరుగుతున్న వేళ నకిలీ ఓటర్ దరఖాస్తుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన పౌరుల పేర్లను తొలగించే లక్ష్యంతో భారీ సంఖ్యలో బోగస్ ‘ఫారం-7’ దరఖాస్తులు సమర్పిస్తున్నారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్‌కు ఉపక్రమించింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు సమర్పించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

బల్క్ ఫారం-7 దరఖాస్తులపై నిఘా

రాష్ట్రంలో 01.10.2026 అర్హత తేదీగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలవుతోంది. ఈ క్రమంలో వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల నమోదు అధికారుల (EROs) వద్దకు ఒకేసారి పెద్ద సంఖ్యలో బల్క్ ఫారం-7 దరఖాస్తులు దాఖలవుతున్నాయని, వాటిలో చాలావరకు నకిలీవని ఈసీ దృష్టికి వచ్చింది. అసలైన ఓటర్లకు తెలియకుండానే వారి పేర్లను తొలగించేందుకు కొందరు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నట్లు వెల్లడైంది.

సెక్షన్ 31 కింద నాన్ బెయిలబుల్ కేసులు

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం సమర్పించే ఫారం-6, ఫారం-6A, ఫారం-7, ఫారం-8 లలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం లేదా తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం (RP Act) 1950 లోని సెక్షన్ 31 కింద చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీఈవో స్పష్టం చేశారు.

Also Read | హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కలకలం: కాంగ్రెస్ నేతల పేర్లే టార్గెట్‌గా ప్రీ-ప్రింటెడ్ ఫారం-7 కుట్ర?

ఈ చర్యలు చేపట్టే ముందు రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్, 1960 లోని రూల్ 20 ప్రకారం పక్కాగా దర్యాప్తు జరపాలని ఈఆర్వోలను ఆదేశించారు. విచారణలో దరఖాస్తులు నకిలీవని తేలితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అధికారులు, పార్టీలకు అధికారిక మెమో జారీ

ఈ వ్యవహారానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ డీఈవోతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు, ఈఆర్వోలకు సీఈవో సి.సుదర్శన్ రెడ్డి అధికారిక మెమో పంపారు.

దీని ప్రతులను రాష్ట్రంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల నేతలకు, సమాచార పౌరసంబంధాల శాఖకు కూడా అందజేశారు. ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Advertisement
Advertisement