Karnataka | భర్తకు జీవిత ఖైదు.. భార్యకు జైలు అధికారి లైంగిక వేధింపులు
Karnataka | జీవిత ఖైదుగా ఉన్న తన భర్తను జైలు నుంచి విడుదల చేయిస్తానని చెప్పి తనను బెంగళూరు సెంట్రల్ జైలు మాజీ చీఫ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేసింది.
Karnataka | త్రినేత్ర న్యూస్ : జీవిత ఖైదుగా ఉన్న తన భర్తను జైలు నుంచి విడుదల చేయిస్తానని చెప్పి తనను బెంగళూరు సెంట్రల్ జైలు మాజీ చీఫ్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం జైళ్లు, సంస్కరణల సేవల విభాగంలో డీఐజీగా విధులు నిర్వహిస్తున్న సదరు అధికారిని పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగిందంటే..?
కర్ణాటక చిక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసులో శంకర్ అనే వ్యక్తికి 2004లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు-I జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత పైకోర్టులు కూడా ఈ శిక్షను సమర్థించాయి. అయితే.. 2018లో సుప్రీంకోర్టు పేరిట ఫోర్జరీ ఆర్డర్స్ సృష్టించి.. శంకర్‌ను విడుదల చేశారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శంకర్, 2018 నవంబర్ 13న నకిలీ సుప్రీంకోర్టు ఆర్డర్ సృష్టించి బెంగళూరు సెంట్రల్ జైలు నుండి ఎలా బయటకు వచ్చాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ఈ విషయం వెలుగు చూసింది.
శంకర్‌ను జైలు నుంచి విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఓ నకిలీ ఆర్డర్స్‌ను ఎస్‌డీఏగా పని చేస్తున్న శ్రీకాంత్ సృష్టించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే బెంగళూరు సెంట్రల్ జైలు చీఫ్ సూపరింటెండెంట్‌గా సోమశేఖర్ ఉన్నప్పుడే ఈ తతంగం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా భర్త శంకర్‌ను జైలు నుంచి విడుదల చేసేందుకు సోమశేఖర్ తనను లైంగికంగా వాడుకున్నాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో సోమశేఖర్‌ను పరప్పన అగ్రహార పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరు పరిచారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు ఆయనను పోలీసు కస్టడీకి అప్పగించింది.
తాజావార్తలు
- ●Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..
- ●Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
- ●Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి
- ●Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!
- ●Telangana CEO Form 7 Order | ఓట్ల తొలగింపునకు నకిలీ ఫారం-7 కుట్ర: బల్క్ దరఖాస్తులపై ఎన్నికల సంఘం కొరడా.. సెక్షన్ 31 కింద కేసులకు ఆదేశం
- ●Bheemgal SI Tirupati | పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం: ఎస్సై వేధింపులే కారణమంటూ వేముల ఫైర్.. రేపు 'భీమ్‌గల్ బంద్'కు పిలుపు

Ponnam vs Adi Srinivas | కబడ్డీ ఆడిన మంత్రులు పొన్నం, ఆది శ్రీనివాస్..

Suicide | చున్నీతో ఉరేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్

Mettu Sai Kumar | మన్నె క్రిశాంక్‌పై కఠిన చర్యలు తీసుకోండి

Horoscope | అక్టోబర్ 6 రాశిఫలాలు.. ఈ రాశి ప్రేమికుల మధ్య అపార్థాలు..!





