Nepal Bus Accident | నదిలో పడిన బస్సు.. 18 మంది ప్రయాణికులు దుర్మరణం
Nepal Bus Accident | హిమాలయ దేశం నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Nepal Bus Accident) జరిగింది. సోమవారం ఉదయం ధాడింగ్ (Dhading) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ( Passenger Bus) అదుపుతప్పి నదిలో పడిపోయింది.
International | Published On Feb 23, 2026, 9.15 am IST
Nepal Bus Accident | త్రినేత్ర.న్యూస్: హిమాలయ దేశం నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Nepal Bus Accident) జరిగింది. సోమవారం ఉదయం ధాడింగ్ (Dhading) జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ( Passenger Bus) అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో 18 మంది మరణించారు. మరో 28 మంది తీవ్రంగా గాయడ్డారు.
45 మంది ప్రయాణికులతో బస్సు ఫోకారా నుంచి ఖాట్మండుకు వెళ్తున్నది. ఈ క్రమంలో బెనిఘాట్ రోరాంగ్ గ్రామీణ మున్సిపాలిటీ-5లోని భైసిగౌడ వద్ద పృథ్వీ హైవేపై బస్సు అదుపుతప్పి త్రిశూలి నదిలోకి దూసుకెళ్లింది. సోమవారం) తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 18 మృతదేహాలను వెలికితీయగా, గాయపడిని 28 మంది ప్రయాణికులను రక్షించారు. వారిని సమీపంలోని దవాఖానలకు తరలించామని డీఎస్పీ థాపా వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన, గాయపడిన వారిని ఇంకా గుర్తించలేదని తెలిపారు.
అయితే మృతుల్లో న్యూజిలాండ్‌కు చెందిన వ్యక్తి ఉన్నారని చెప్పారు. జపాన్, డచ్ జాతీయులైన ఇద్దరు మహిళలు గాయపడ్డారని వెల్లడించారు. అతివేగం లేదా సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
https://x.com/tweet_sandeep/status/2025757122156437766
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






