Plane Crash | మరో విమాన ప్రమాదం.. చట్టసభ సభ్యుడు సహా 15 మంది దుర్మరణం
Plane Crash | మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో (Plane Crash) మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఓ చట్టసభ సభ్యుడితో (Lawmaker) సహా 15 మంది మరణించారు.
International | Published On Jan 29, 2026, 6.41 am IST
త్రినేత్ర.న్యూస్: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో (Plane Crash) మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో ఘటన చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఓ చట్టసభ సభ్యుడితో (Lawmaker) సహా 15 మంది మరణించారు. అయితే ఈ ప్రమాదం జరిగింది లాటిన్ అమెరికా దేశమైన కొలంబియాలో (Colombia).
వెనెజులా సరిహద్దులకు సమీపంలోని కుకుటాలో (Cucuta) బుధవారం సాయంత్రం (స్థానిక కాలమానం) ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన సటెనాకు చెందిన బీచ్‌క్రాఫ్ట్ 1900 అనే ట్విట్ ప్రొపెల్లర్ విమానం కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న కొలంబియా చాంబర్ ఆఫ్ డిప్యూటీస్ సభ్యుడు డియోజెనెస్ క్విటెరో, రానున్న ఎన్నికల్లో పోటీచేస్తున్న కార్లోస్ సాల్సెడో, వారి టీమ్ 11 మంది, విమాన సిబ్బంది ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. విమానంలో ఉన్న ఏ ఒక్కరూ ప్రాణాలతో బయట పడలేదని కొలంబియా సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది.
కాగా, కుకుటా ప్రాంతం మొత్తం పర్వతాలతో కూడి ఉంటుందని, ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూ ఉంటుందని అధికారులు తెలిపారు. విమానం జాడ కనుక్కునేందుకు ఎయిర్ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






