త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KitKat | 12 ట‌న్నుల‌ కిట్‌క్యాట్ చాక్లెట్ల‌తో వెళ్తున్న ట్ర‌క్కు మాయం..

KitKat | మ‌నం సాధార‌ణంగా బ్యాంకులో దొంగ‌త‌నం గురించి వింటూ ఉంటాం. ఏటీఎం వ్యాన్‌ను కొల్ల‌గొట్ట‌డం వంటి వార్త‌లు చూస్తుంటాం. అయితే ఈ దొంగ‌లు కొత్త‌గా ఆలోచించిన‌ట్టున్నారు. అంద‌రిలా తామెందుకు ఉండాల‌నుకున్నారో ఏమో.. ఏకంగా చాక్లెట్ల లోడుతో వెళ్తున్న ట్ర‌క్కును (Chocolate truck) ఎత్తుకెళ్లారు.

G

International | Published On Mar 30, 2026, 7.17 am IST

KitKat | 12 ట‌న్నుల‌ కిట్‌క్యాట్ చాక్లెట్ల‌తో వెళ్తున్న ట్ర‌క్కు మాయం..
Advertisement

KitKat | త్రినేత్ర‌.న్యూస్‌: మ‌నం సాధార‌ణంగా బ్యాంకులో దొంగ‌త‌నం గురించి వింటూ ఉంటాం. ఏటీఎం వ్యాన్‌ను కొల్ల‌గొట్ట‌డం వంటి వార్త‌లు చూస్తుంటాం. అయితే ఈ దొంగ‌లు కొత్త‌గా ఆలోచించిన‌ట్టున్నారు. అంద‌రిలా తామెందుకు ఉండాల‌నుకున్నారో ఏమో.. ఏకంగా చాక్లెట్ల లోడుతో వెళ్తున్న ట్ర‌క్కును (Chocolate Truck) ఎత్తుకెళ్లారు. అందులో ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో తెలిస్తే మీరూ ఆశ్చ‌ర్య‌పోతారు!. ఈ ఘ‌ట‌న యూర‌ప్‌లో జ‌రిగింది.

ప్ర‌ముఖ కంపెనీ నెస్లే (Nestle).. 12 ట‌న్నుల‌కుపైగా కిట్‌క్యాట్ (KitKat) చాక్లెట్ల‌ను ఇట‌లీ నుంచి పోలాండ్‌కు ట్ర‌క్‌లో త‌ర‌లిస్తున్న‌ది. అందులో 4 ల‌క్ష‌ల 13 వేల చాక్లెట్ బార్లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ట్ర‌క్ జాడ‌లేకుండా పోయింది. రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ గ‌మ్య‌స్థానానికి చేరుకోక‌పోవ‌డంతో ట్ర‌క్కు అప‌హ‌ర‌ణ‌కు గురైన‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. అయితే అది క‌చ్చితంగా ఏ ప్రాంతంలో క‌నిపించ‌కుండా పోయింద‌నే విష‌యాన్ని మాత్రం వెళ్ల‌డించ‌లేదు.

ట్ర‌క్కులో 4 ల‌క్ష‌ల‌కుపైగా చాక్లెట్లు ఉన్నాయ‌ని, అది డీల‌ర్ల వ‌ద్ద‌కు చేరుకోక‌పోవ‌డంతో యూర‌ప్‌లోని కొన్ని దేశాల సూప‌ర్ మార్కెట్ల‌లో కిట్‌క్యాట్ చాక్లెట్ బార్లు క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని నెస్లే తెలిపింది. అయితే అప‌ర‌హ‌ర‌ణ‌కు గురైన చాక్లెట్ల‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్మాల‌నుకున్న‌ప్ప‌టికీ బ్యాచ్ కోడ్ ద్వారా స్కాన‌ర్లు వాటిని గుర్తిస్తాయ‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

కాగా, ఇలాంటి ఘ‌ట‌నే యూపీలోని ల‌క్నోలో కూడా జ‌రిగింది. లక్నోలోని ఓ గోదాంలోకి చొరబడిన దొంగలు రూ.17లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్లను ఎత్తుకెళ్లారు. చిన్హత్‌ ప్రాంతంలో నివాసముండే రాజేంద్ర సింగ్ సిద్ధు చాక్లెట్ల డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నారు. ఇందుకోసం తనకు చెందిన ఓ ఇంటిని గోదాంగా వినియోగిస్తున్నాడు. గోదాంలోకి చొరబడిన కొందరు దొంగలు అందులోకి మొత్తం చాక్లెట్లను లూటీ చేశారు. వాటితోపాటు సీసీ కెమెరాలు, ఇతర పరికరాలను సైతం చోరీ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement