Youtuber Komali | లవ్ ఫెయిల్యూర్.. యూట్యూబర్ కోమలి బలవన్మరణం
Youtuber Komali | ప్రముఖ యూట్యూబర్ కోమలి (Youtuber Komali) ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన కోమలి హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి ఎల్ఐజీ కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్నది.
Youtuber Komali | త్రినేత్ర.న్యూస్: ప్రముఖ యూట్యూబర్ కోమలి (Youtuber Komali) ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన కోమలి హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి ఎల్ఐజీ కాలనీలో తన మామ ఇంట్లో ఉంటున్నది. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్నది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన నిఖిల్ రెడ్డి పరిచయం అయ్యాడు. అదికాస్త వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. గత మూడేండ్లుగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు.
అయితే ఇద్దరి మధ్య విభేదాలతో ఏడాది క్రితం బ్రేకప్ అయ్యింది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం కోమలి ఆత్మహత్యకు యత్నించింది. అయితే బంధువులు సర్దిచెప్పారు. ఇటీవల పెండ్లి విషయంలో కోమలి, నిఖిల్ రెడ్డి గొడవపడ్డారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో కోమలి ఉరివేసుకుంది.
కాగా, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉండేలా చూడాలని మొక్కుతూ తిరుమల కాలినడకన వెళ్లిన కోమలి.. ప్రతీ మెట్టుకు బొట్టు పెడుతూ ఎక్కుతూ వీడియో పోస్ట్ చేసింది. ఇదే తన చివరి వీడియో!. కోమలి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




