త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chirumarthi Lingaiah | తొక్కుతా తొక్కుతా అంటున్న‌వ్‌.. నిన్నే తొక్కేందుకు ప్ర‌జ‌లు వెయిటింగ్‌

Chirumarthi Lingaiah | సీఎం రేవంత్ తొక్కుతా తొక్కుతా అంటున్నార‌ని.. ఆయ‌న్నే ప్ర‌జ‌లు తొక్కేందుకు ఎదురుచూస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య ఫైర‌య్యారు. నల్లగొండ జిల్లాకు రేవంత్ ఆరుసార్లు వచ్చినా ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌న్నారు.

S

Hyderabad | Published On Jun 29, 2026, 4.42 pm IST

Chirumarthi Lingaiah | తొక్కుతా తొక్కుతా అంటున్న‌వ్‌.. నిన్నే తొక్కేందుకు ప్ర‌జ‌లు వెయిటింగ్‌
Advertisement
  • న‌ల్ల‌గొండ‌కు ఆరుసార్లు వ‌చ్చిన‌వ్.. కానీ ఇచ్చింది సున్నా
  • జిల్లాకు రావ‌డానికి సిగ్గుండాలే
  • నువ్ ముఖ్య‌మంత్రివా? ప‌శువుల కాప‌రా?
  • చేత‌గాక‌పోతే త‌ప్పుకో.. మ‌స్తు మంది ఉన్న‌రు
  • ద‌మ్ముంటే కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల స‌వాళ్లు స్వీక‌రించు
  • రేవంత్‌పై మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య ఫైర్‌

Chirumarthi Lingaiah | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ తొక్కుతా తొక్కుతా అంటున్నార‌ని.. ఆయ‌న్నే ప్ర‌జ‌లు తొక్కేందుకు ఎదురుచూస్తున్నార‌ని మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య ఫైర‌య్యారు. నల్లగొండ జిల్లాకు రేవంత్ ఆరుసార్లు వచ్చినా ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌న్నారు. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చేతకాని వారిలా తయార‌య్యారని ఎద్దేవా చేశారు. ఈమేర‌కు సోమ‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. రేవంత్ ముఖ్య‌మంత్రా.. ప‌శువుల కాప‌రా అని మండిప‌డ్డారు.

ఉద్యమంపై తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్ రెడ్డికి అమరవీరులపై నైతికత ఎక్కడిది? ఉద్యమంలో బలిదానాలకు కాంగ్రెస్, టీడీపీలు కారణం కాదా? అపుడు రేవంత్ ఏ పార్టీలో ఉన్నారు? తొక్కుతా తొక్కుతా అంటున్నారు.. రేవంత్‌ను తొక్కే సమయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. నల్లగొండలో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేసీఆర్ టైమ్‌లోనే జరిగింది. నల్లగొండకు ఏమీ చేయకుండా జిల్లాకు రావడానికి సిగ్గుండాలి. రేవంత్ ప్రసంగిస్తుండగానే జనాలు సభ నుంచి వెళ్లి పోయారు అని లింగ‌య్య విమ‌ర్శించారు.

దమ్ముంటే మా హరీశ్‌రావు, కేటీఆర్‌ల‌ సవాళ్లను స్వీకరించాలి. రేవంత్ ఓటుకు నోటు దొంగ,పెద్ద బ్లాక్ మెయిలర్. సీఎం పదవిలో ఉన్నపుడు భాష మంచిగా ఉండాలి. నువ్ ముఖ్యమంత్రా? పశువుల కాపరా? రేవంత్ తన సొంత పార్టీ నేతలకు కూడా భయపడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలే రేవంత్ పాలనపై పెదవి విరుస్తున్నారు. రేవంత్ ను ఆదర్శంగా తీసుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల రక్తం తాగుతున్నారు. ఢిల్లీకి 72 సార్లు వెళ్లి యూరియా కూడా తేలేకపోయారు. ఢిల్లీలో రాత్రి బీజేపీ నేతలతో భేటీ.. ఉదయం రాహుల్ గాంధీకి మూటలు.. ఇదే రేవంత్ దిన చర్యగా మారింది. చేతగాకపోతే సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. కాంగ్రెస్‌లో చాలా మంది సమర్థులు ఉన్నారు అని మాజీ ఎమ్మెల్యే లింగ‌య్య ఎద్దేవా చేశారు.

రేవంత్‌రెడ్డి పిక్ పాకెట‌ర్‌: బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే

చరిత్ర తెలవనోడు, చేత కానోడు రేవంత్ రెడ్డి. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను దుర్భాషలాడటం బాధాకరం. చేసిన అభివృద్ధి గురించి మాట్లాడు. మూసీ కోసం అడ్డొచ్చిన వారిని తొక్కుతా అనే భాష మాట్లాడుతున్నాడు. ఎవరిని తొక్కుతావ్, అడ్డం వచ్చిన రైతులను తొక్కుతవా? కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేసుకోని దద్దమ్మ రేవంత్. పైగా బీఆర్ఎస్‌ను ఏదో చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. రేవంత్ రెడ్డి పిక్ పాకెటర్‌లా కత్తెర జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడు. 2034 దాకా సీఎంగా ఉంటానని ప్రగల్భాలు పలుకుతున్నారు. కాంగ్రెస్ హై కమాండ్‌కు మూటలు బంద్ చేసిన మరుక్షణమే రేవంత్ పదవి ఊడుతుంది.

Advertisement
Advertisement