Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
Samsung Galaxy M47 5G | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం47 5జిని భారత్‌లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను యువత, గేమింగ్ ప్రియులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువ సేపు ఆస్వాదించేవారి కోసం విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది.
Technology | Published On Jun 29, 2026, 5.03 pm IST
Samsung Galaxy M47 5G | ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎం47 5జిని భారత్‌లో విడుదల చేసింది. మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయిన ఈ ఫోన్‌ను యువత, గేమింగ్ ప్రియులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఎక్కువ సేపు ఆస్వాదించేవారి కోసం విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. ఇందులో శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీని ఇచ్చినందున వినియోగదారులు ఎక్కువ సేపు ఫోన్‌ను ఉపయోగించినా ఎక్కువ భారం పడదని తెలియజేసింది. ఇందులో మెరుగైన కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను అందించనున్నారు. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇది చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. వేగంగా పనిచేస్తుంది. దీని వల్ల యాప్‌లు చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. మల్టీ టాస్కింగ్ సులభంగా సాగుతుంది. డేటా ట్రాన్స్‌ఫర్ కూడా వేగంగా పూర్తవుతుంది.
భారీ బ్యాటరీ..
గేమింగ్ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన బ్యాటరీ ఫీచర్‌ను ఇచ్చారు. ఫోన్‌ను చార్జింగ్‌కు కనెక్ట్ చేసి అలాగే ఉంచి కూడా గేమ్స్ ఆడవచ్చు. బ్యాటరీపై ఎలాంటి ప్రభావం పడదు. బైసాస్ చార్జింగ్ అనే ఫీచర్ ఉన్నందున ఫోన్ 100 శాతం చార్జింగ్ అయ్యాక బ్యాటరీ పవర్‌ను కాకుండా నేరుగా అడాప్టర్ పవర్‌ను ఉపయోగించుకుంటుంది. దీని వల్ల బ్యాటరీ వినియోగం తగ్గి లైఫ్ పెరుగుతుంది. అలాగే ఫోన్ హీట్ అవకుండా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.7 ఇంచుల అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నందున దృశ్యాలు నాణ్యంగా కనిపిస్తాయి. ఔట్ డోర్ విజిబిలిటీ కోసం డిస్‌ప్లేకు 1400 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను ఇచ్చారు. డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నందున ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. అయితే చార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
6 ఏళ్ల వరకు అప్‌డేట్స్..
ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. 2 మెగాపిక్సల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఈ కెమెరాలతో అద్భుతమైన 4కె వీడియోలను చిత్రీకరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. ముందు భాగంలో 12 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభిస్తుంది. ఈ ఫోన్ కు 6 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలిపింది. అలాగే సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని వంటి ఏఐ ఫీచర్లు, శాంసంగ్ వాలెట్ (ట్యాప్ అండ్ పే), ఆన్-డివైస్ వాయిస్ మెయిల్, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ఆటో బ్లాకర్ వంటి భద్రతా ఫీచర్లను కూడా ఇందులో అందించారు. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ ఉంది. స్టీరియో స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, 4జీ వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జి ఫోన్ రోగ్ రెడ్, బ్లేజ్ బ్లూ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. కూపన్ ఆఫర్‌తో ప్రారంభ ధరను రూ.22,999గా నిర్ణయించారు. జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- ●Harish Rao | నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఖండించిన హరీశ్‌రావు
- ●Chirumarthi Lingaiah | తొక్కుతా తొక్కుతా అంటున్నవ్.. నిన్నే తొక్కేందుకు ప్రజలు వెయిటింగ్
- ●Bharat Gaurav Train | తూర్పు భారత పుణ్యక్షేత్రాల టూర్.. భారత్ గౌరవ్ రైలుకు బుకింగ్స్ ప్రారంభం..
- ●Kriti Sanon | కృతి సనన్ లవ్‌స్టోరీకి బ్రేకప్ - మరో అమ్మాయితో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ప్రియుడు
- ●Jagadish Reddy | కేసీఆర్ వస్తే నిధుల వరద.. రేవంత్ వస్తే బూతుల కంపు

Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

Harish Rao | నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఖండించిన హరీశ్‌రావు

Chirumarthi Lingaiah | తొక్కుతా తొక్కుతా అంటున్నవ్.. నిన్నే తొక్కేందుకు ప్రజలు వెయిటింగ్

Bharat Gaurav Train | తూర్పు భారత పుణ్యక్షేత్రాల టూర్.. భారత్ గౌరవ్ రైలుకు బుకింగ్స్ ప్రారంభం..




