Air New Zealand | 2 సెకెన్లు లేటైంటే వందల ప్రాణాలు పోయేవి.. పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Air New Zealand | న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ (Wellington) ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ న్యూజిలాండ్‌కు (Air New Zealand) చెందిన 'NZ272' విమానం వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. భారీ వర్షం, అకస్మాత్తుగా బలమైన గాలులు (విండ్ షేర్) వీచాయి. పరిస్థితిని గమనించిన పైలట్ తన అప్రమత్తతతో పెను ప్రమాదం జరగకుండా ఆపడమే కాకుండా.. వందలాది మంది ప్రాణాలను కాపాడారు.
International | Published On Jun 29, 2026, 5.16 pm IST
Air New Zealand | న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్ (Wellington) ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ న్యూజిలాండ్‌కు (Air New Zealand) చెందిన 'NZ272' విమానం వెల్లింగ్టన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా.. భారీ వర్షం, అకస్మాత్తుగా బలమైన గాలులు (విండ్ షేర్) వీచాయి. ఆ క్షణం విమానం టైర్లు కూడా రన్‌వేని తాకాయి. అయితే, విండ్ షేర్ (Wind Shear) కారణంగా అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఒక్కసారిగా గాల్లోకి లేపారు.
కేవలం రెండు సెకన్లలోనే విమానం రన్‌వేని తాకడం.. మళ్లీ టేకాఫ్ అవడం జరిగిపోయాయి. క్షణం లేటైనా వందల మంది ప్రాణాలు పోయేవి. పైలట్ రైట్ టైమ్‌లో తీసుకున్న ఈ నిర్ణయం వందలాది మంది ప్రాణాలను కాపాడింది. ఆ తర్వాత కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం గాలుల తీవ్రత తగ్గాక సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇలా విమానం రన్‌వేపై దిగుతూ మళ్లీ పైకి ఎగరడాన్ని గో-అరౌండ్ ల్యాండింగ్ (Go-Around Landing) అని అంటారు.
విండ్ షేర్ అంటే గాలి వేగం, దాని దిశలో ఒక్కసారిగా వచ్చే విపరీతమైన మార్పు. విమానం ల్యాండ్ అవ్వడానికి తన వేగాన్ని తగ్గించుకుంటున్న సమయంలో.. ఇలాంటి బలమైన గాలులు హఠాత్తుగా వీస్తే అది క్షణాల్లో నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. తడి రన్‌వేపై, తీవ్రమైన గాలుల మధ్య విమానాన్ని ల్యాండ్ చేయడమంటే చాలా ప్రమాదంతో కూడుకున్నది. అందుకే పరిస్థితిని గమనించిన పైలట్ తన అప్రమత్తతతో పెను ప్రమాదం జరగకుండా ఆపడమే కాకుండా.. వందలాది మంది ప్రాణాలను కాపాడారు.
सिर्फ़ 2 सेकंड और सैकड़ों ज़िंदगियाँ फिर से आसमान में!
Air New Zealand की फ्लाइट NZ272 Wellington में लैंड करने ही वाली थी। प्लेन के पहिए रनवे को छू चुके थे, तभी तेज़ बारिश और अचानक आए Wind Shear ने सब कुछ बदल दिया।
उस एक पल में पायलट ने ऐसा फैसला लिया, जिसने सभी यात्रियों की… pic.twitter.com/cOqBJl3zQd
— Jamal | Viral desk (@jamalk38) June 28, 2026
తాజావార్తలు
- ●Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే
- ●Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
- ●Samsung Galaxy M47 5G | భారత్‌లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎం47 5జీ.. భారీ బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్..
- ●Harish Rao | నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఖండించిన హరీశ్‌రావు

Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ ప్రకటన వచ్చేసింది!

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!

Karne Prabhakar | సీఎం మాట్లాడితే మెదడుకు, మూతికి సంబంధమే ఉంటలే

Unemployed Youth Protest | పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ముట్టడి యత్నం.. నిరుద్యోగులను ఈడ్చుకెళ్లిన పోలీసులు



