Gold Jewellery Theft | బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. కిలోకుపైగా బంగారు నగలు మాయం
Gold Jewellery Theft | హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో (Banjara hills)భారీ దోపిడీ జరిగింది. ఓ ఎక్స్‌పోర్టు కార్యాలయంలో భద్రపరిచిన కిలోకుపైగా బంగారు నగలు (Gold Jewellery Theft) చోరీ అయ్యాయి.
Gold Jewellery Theft | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో (Banjara hills)భారీ దోపిడీ జరిగింది. ఓ ఎక్స్‌పోర్టు కార్యాలయంలో భద్రపరిచిన కిలోకుపైగా బంగారు నగలు (Gold Jewellery Theft) చోరీ అయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఈడెన్ గార్డెన్‌లో ఉన్న గురుకృప ఎక్స్‌పోర్ట్స్ (Gurukrupa Exports) ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో డైమండ్ ఫిక్సింగ్ కోసం సంస్థ లాకర్‌లో 1028.59 గ్రాముల బరువున్న 14 బంగారు ఆభరణాలు భద్రపరిచారు. అందులో 7 నెక్లెస్‌లు, 7 జతల చెవిపోగులు ఉన్నాయి.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వ్యాపారి ప్రీతేశ్‌రమణి గురుకృప ఎక్స్‌పోర్ట్స్‌లో వజ్రాలు పొదిగే (Diamond) పనికోసం ఆభరణాలు తీసుకొచ్చి లాకర్‌లో భద్రపరిచారు. సోమవారం ఉదయం లాకర్ తెరచి చూడగా అవి కనిపించకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి దుండగులు లోనికి ప్రవేశించినట్లు గుర్తించారు. శనివారం రాత్రి చోరీ జరిగినప్పటికీ.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన నగల విలువ రూ.కోటి వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
వాష్‌రూమ్ కిటికీ ధ్వంసం చేసి..
కార్యాలయంలోని బాత్‌రూమ్ కిటీకీ పగలగొట్టి ఉండటంతో దుండగులు అక్కడి నుంచే లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కొన్ని ఆధారాలు సేకరించాయి. కార్యాలయంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. చోరీకి పాల్పడింది బయటివారా? లేకా ఆఫీసు సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
- ●Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి
- ●Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు
- ●Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..
- ●Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి
- ●Indian Roller | పాలపిట్టను బంధిస్తే మూడేండ్ల జైలు.. దసరా వేళ ప్రదర్శిస్తే కఠిన చర్యలు..
- ●Smriti Irani | రాజ్యసభకు మళ్లీ వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ..!

Myanmar | మార్కెట్ ప్రాంతంపై సైన్యం భీకర దాడులు.. 49 మంది మృతి

Canara Bank Recruitment | కెనరా బ్యాంకులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు.. తెలంగాణలో 134, ఏపీలో 247 ఖాళీలు

Stock Markets | షేర్ మార్కెట్లలో మళ్లీ భారీ పతనం.. 22,600 దిగువకు నిఫ్టీ..

Sheep | బీబీనగర్‌లో విషాదం.. రైలు ఢీకొని సుమారు 100 గొర్రెలు మృతి






