Murder | నలుగురు పిల్లల తల్లికి వేధింపులు.. పుట్టింటికి పిలిచి చున్నీతో ఉరేసిన వివాహిత
Murder | ఓ యువకుడు వివాహితపై మనసు పారేసుకున్నాడు. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఆ యువకుడి వేధింపులు తాళలేక.. సదరు వివాహిత తన పుట్టింటికి పిలిపించి.. చున్నీతో ఉరేసింది.
Murder | త్రినేత్ర న్యూస్ : ఓ యువకుడు వివాహితపై మనసు పారేసుకున్నాడు. ఆమెకు భర్త, నలుగురు పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఆమెను వేధింపులకు గురి చేశాడు. ఆ యువకుడి వేధింపులు తాళలేక.. సదరు వివాహిత తన పుట్టింటికి పిలిపించి.. చున్నీతో ఉరేసింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మంగళ్‌హాట్‌లో సోమవారం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ధూల్‌పేట శివలాల్‌నగర్‌కు చెందిన అనిషా సింగ్, లకన్ సింగ్ దంపతులు. వీరికి నలుగురు సంతానం. ఇదే ప్రాంతంలో సాయినాథ్‌సింగ్(26) అనే యువకుడు నివసిస్తున్నాడు. అయితే అనిషా సింగ్‌పై సాయినాథ్‌సింగ్ మనసు పారేసుకున్నాడు. ఆమెను శారీరకంగా లోబర్చుకోవాలకున్నాడు. ఈ క్రమంలో ఆమెను వేధింపులకు గురి చేశాడు. విషయం తెలుసుకున్న లకన్‌సింగ్ పద్ధతి మార్చుకోవాలని సాయినాథ్ సింగ్‌ను హెచ్చరించాడు. అయినా కూడా అతనిలో మార్పురాలేదు.
మళ్లీ అనిషాను వేధించడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి వేధింపులు తాళలేక రహీంపురలో పుట్టింట్లో ఉన్నాను.. ఇక్కడికి రావాలని సాయినాథ్‌కు ఆమె సూచించింది. ఇక అక్కడికి వెళ్లిన సాయినాథ్ మెడకు చున్నీ చుట్టి ఉరేసింది.
సాయినాథ్ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనిషాసింగ్‌కు ఇంకెవరైనా సహకరించారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
- ●Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా
- ●TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్
- ●KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్..!
- ●Horoscope | సెప్టెంబర్ 29 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
- ●CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
- ●SIR | సైమన్ గో బ్యాక్‌లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి

Hyderabad Theatre | 22 నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రారంభం.. థియేటర్‌కు రూ. 75 వేలు జరిమానా

TOSS | అక్టోబర్ 11 నుంచి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్

KTR | కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్..!

Horoscope | సెప్టెంబర్ 29 రాశిఫలాలు.. మీ రాశిఫలం ఎలా ఉందంటే..?





