త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు

Woman dies in hospital | కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ కోసం వ‌చ్చిన రోగి మృతి చెంద‌డంతో రోగి బంధువులు ఆస్ప‌త్రి ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో చోటు చేసుకుంది.

S

Hyderabad | Published On Jul 19, 2026, 4.41 pm IST

Woman dies in hospital | ఆస్పత్రిలో మహిళ మృతి.. ఆందోళనకు దిగిన బంధువులు
Advertisement

Woman dies in hospital | త్రినేత్ర‌.న్యూస్‌: కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ కోసం వ‌చ్చిన రోగి మృతి చెంద‌డంతో రోగి బంధువులు ఆస్ప‌త్రి ఎదుట ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న హయత్‌నగర్‌లోని నీలాద్రి హాస్పిటల్‌లో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన మంజుల అనే మహిళ కుటుంబ నియంత్ర‌ణ శ‌స్త్రచికిత్స కోసం నీలాద్రి ఆస్ప‌త్రిలో చేరింది. అయితే చికిత్స విక‌టించ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు, బంధువులు డాక్ట‌ర్ల నిర్లక్ష్యం వ‌ల్ల‌నే మంజుల చ‌నిపోయింద‌ని ఆరోపిస్తూ ఆందోళ‌న‌కు దిగారు. శ‌స్త్రచికిత్స‌కు ముందు యాంటీబ‌యాటిక్ ఇంజెక్ష‌న్ ఇచ్చార‌ని, దాంతో ఆమె ఆరోగ్యం విష‌మించి ప్రాణాలు కోల్పోయింద‌ని వివ‌రించారు. మంజుల మృతికి వైద్యులే బాధ్యుల‌ని మండిప‌డ్డారు.

Advertisement
Advertisement