త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | ప్రైవేట్ వాట‌ర్‌ ట్యాంకర్ల‌కు వాటర్‌బోర్డు లోగో వినియోగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: వాట‌ర్‌బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రైవేటు నీటి ట్యాంక‌ర్ య‌జ‌మానులు అన‌ధికారికంగా జ‌ల‌మండ‌లి (HMWSSB) అధికారిక లోగోను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి (Ashok Reddy) హెచ్చరించారు.

G

Hyderabad | Published On Mar 28, 2026, 11.02 am IST

HMWSSB | ప్రైవేట్ వాట‌ర్‌ ట్యాంకర్ల‌కు వాటర్‌బోర్డు లోగో వినియోగిస్తే క‌ఠిన చ‌ర్య‌లు: వాట‌ర్‌బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి
Advertisement

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్‌: ప్రైవేటు నీటి ట్యాంక‌ర్ య‌జ‌మానులు అన‌ధికారికంగా జ‌ల‌మండ‌లి (HMWSSB) అధికారిక లోగోను వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌ రెడ్డి (Ashok Reddy) హెచ్చరించారు. వాటర్‌బోర్డు లోగో సంస్థ ప్రభుత్వ అధికారిక గుర్తింపు చిహ్నమని తెలిపారు. తమ అనుమతి లేకుండా వినియోగించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని చెప్పారు. శుక్ర‌వారం (మార్చి 27న‌) నిర్వహించిన తనిఖీల్లో ఒక ప్రైవేట్‌ నీటి ట్యాంకర్‌ వాటర్‌బోర్డు లోగోను అనధికారికంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో దానిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, లోగో దుర్వినియోగం జరిగినట్లు గమనిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రైవేటు ట్యాంక‌ర్ల మోసాల‌పై ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ సూచించారు. అన‌ధికార లోగో వినియోగం గ‌మ‌నిస్తే అధికారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు. ప్ర‌జ‌ల స‌హ‌కారంతో అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్రజలు తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకోవాలనుకుంటే.. జలమండలి అధికారిక కస్టమర్ కేర్‌కు కాల్ చేయాల‌న్నారు. వారి ద్వారా మాత్రమే ట్యాంకర్ బుక్ చేసుకోవాల‌ని వెల్ల‌డించారు. టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేయబడిన తాగునీటిని పొందవచ్చని అధికారులు తెలిపారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement