Hyderabad | ఆ సెక్యూరిటీ గార్డును ఉరి తీయండి..!
Hyderabad | బొల్లారం కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ప్రధాన నిందితుడు, సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ను ఉరి తీయాలని విల్లా ఆర్కిడ్స్ నివాసితులు డిమాండ్ చేశారు.
కౌకూర్ విల్లా ఆర్కిడ్స్ నివాసితులు డిమాండ్
Hyderabad | బొల్లారం కౌకూర్‌లో ఐదేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే. చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ప్రధాన నిందితుడు, సెక్యూరిటీ గార్డ్ విక్రమ్‌ను ఉరి తీయాలని విల్లా ఆర్కిడ్స్ నివాసితులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి సీపీ సుమతిని కోరారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలిపారు. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే..?
విల్లా ఆర్కిడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఆడుకుంటూ వెళ్లిన చిన్నారిని విక్రమ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి, ఆమె శరీరానికి పెద్ద రాయి కట్టి నీటి సంపులో విసిరేశాడు. పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో సెల్లార్ నుంచి ఒక్కడే బయటకు వచ్చి వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇక ఈ కేసులో మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
- ●Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి
- ●Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
- ●Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
- ●Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి
- ●Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు
- ●Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు

Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి

Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..

Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి





